amp pages | Sakshi

నెట్స్‌లో ఇరగదీసిన శిఖర్‌ ధావన్‌.. వీడియో వైరల్‌

Published on Sat, 09/11/2021 - 12:28

దుబాయ్‌: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2021కు సంబంధించి బీసీసీఐ ప్రకటించిన టీమిండియా జట్టులో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ను ఎంపిక చేయలేదు. ఫామ్‌లో ఉన్న ధావన్‌ను పరిగణలోకి తీసుకోకపోవడంపై అభిమానుల మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. స్థిరత్వ ప్రదర్శన ఉంటే సరిపోదని.. ఆటలో వేగం ఉండాలనే కారణంతో ధావన్‌ స్థానంలో మూడో ఓపెనర్‌గా ఇషాన్‌ కిషన్‌ను ఎంపిక చేసినట్లు సెలక్టర్లు చెప్పుకొచ్చారు.

చదవండి: T20 World Cup 2021: శిఖర్‌ ధావన్‌ను అందుకే ఎంపిక చేయలేదా!

ఈ విషయం పక్కనపెడితే శిఖర్‌ ధావన్‌ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో అంచె పోటీల్లో పాల్గొనేందుకు  ధావన్‌ ఇప్పటికే యూఏఈకి చేరుకున్నాడు. తాజాగా నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోనూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ప్యాడ్స్‌ కట్టుకోవడం దగ్గర్నుంచి బ్యాటింగ్‌ చేసేవరకు ప్రతీది వీడియోలో పొందుపరిచాడు. వీడియో కింద 'సూర్మా' అని క్యాప్షన్‌ జత చేశాడు. సూర్మా అంటే పంజాబీ భాషలో ''డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌'' అని అర్థం. 

ఇక శిఖర్‌ ధావన్‌ ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఫస్ట్‌ హాఫ్‌ ముగిసేసరికి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 8 మ్యాచ్‌లాడిన ధావన్‌ 134.27 స్ట్రైక్‌ రేట్‌తో 380 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో తొలి స్థానంలో ఉన్నాడు. ఇక ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ ప్రదర్శనతో దుమ్మురేపి టేబుల్‌ టాపర్‌గా నిలిచింది. 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.  

చదవండి: T20 World Cup: వారిద్దరికి దక్కని చోటు.. గావస్కర్ టీ 20 ప్రపంచకప్ జట్టు ఇదే!

Shane Warne: టీమిండియా అద్భుతం; ఆటతీరుతో నా టోపీని ఎత్తుకెళ్లారు

Videos

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)