amp pages | Sakshi

రెండుసార్లు బచాయించినా గెలిపించలేకపోయారు

Published on Sat, 02/26/2022 - 10:23

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌ 2022) చివరి అంకానికి చేరుకుంది. లాహోర్‌ ఖలందర్స్‌, ముల్తాన్‌ సుల్తాన్స్‌ ఫైనల్లో అమితుమీ తేల్చుకోనున్నాయి. కాగా ఎలిమినేటర్‌ 2లో భాగంగా శుక్రవారం లాహెర్‌ ఖలందర్స్‌ ఇస్లామాబాద్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ ఇన్నింగ్స్‌ సమయంలో కెప్టెన్‌  షాహిన్‌ అఫ్రిది తన  చివరి ఓవర్‌ వేశాడు. ఇస్లామాబాద్‌ గెలవాలంటే 4 ఓవర్లలో 35 పరుగులు చేయాలి. క్రీజులో హిట్టర్‌ అసిఫ్‌ అలీతో పాటు హసన్‌ అలీ ఉన్నారు.

ఓవర్‌ తొలి బంతిని అసిఫ్‌ బౌండరీ పంపించాడు. రెండో బంతిని సింగిల్‌ తీయడంతో హసన్‌ అలీ స్ట్రైక్‌కు వచ్చాడు. మూడో బంతిని హసన్‌ భారీ షాట్‌ ఆడినప్పటికి బంతి వెళ్లి డేవిడ్‌ వీస్‌ చేతిలో పడింది. కానీ రిప్లేలో నోబాల్‌ అని తేలింది. అప్పటికే ఒక పరుగు పూర్తైంది. ఆ తర్వాత ఫ్రీ హిట్‌లోనూ అసిఫ్‌ అలీ కూడా అదే తరహాలో భారీ షాట్‌ ఆడాడు. లాంగాన్‌ దిశలో ఫీల్డర్‌ క్యాచ్‌ తీసుకున్నప్పటికి కౌంట్‌ కిందకు రాదు. అలా రెండుసార్లు ఔట్‌ నుంచి బచాయించినప్పటికి ఇద్దరు అలీలు మ్యాచ్‌ను మాత్రం గెలిపించలేకపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. లాహోర్‌ ఖలందర్స్‌ 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్‌ విక్టరీ నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లాహోర్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. షఫీక్‌ 52 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. కమ్రాన్‌ గులామ్‌ 30, డేవిడ్‌ వీస్‌ 28 నాటౌట్‌,  మహ్మద్‌ హఫీజ్‌ 28 పరుగులు చేశారు. అనంతరం ఇస్లామాబాద్‌ యునైటెడ్స్‌ 19.4 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్‌ అయింది. అజమ్‌ ఖాన్‌ 40 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

చదవండి: Ruturaj Gaikwad: యువ క్రికెటర్‌ను వెంటాడిన దురదృష్టం.. లంకతో టి20 సిరీస్‌కు దూరం

Ind Vs SL 1st T20I: అక్కడ ఉంది శ్రేయాస్‌ అయ్యర్‌.. డౌట్‌ అక్కర్లేదు

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)