amp pages | Sakshi

అతనిలో ప్రతిసారి ఏదో కొత్తదనం కనిపిస్తుంది.. హైదరబాదీ పేసర్‌ని ఆకాశానికెత్తిన సచిన్‌

Published on Wed, 12/22/2021 - 18:39

హైదరాబాదీ పేస్‌​ గన్‌ మహ్మద్‌ సిరాజ్‌పై దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ప్రశంసల వర్షం కురిపించారు. అతన్ని చూసిన ప్రతిసారి ఏదో కొత్తదనం కనిపిస్తుందంటూ ఆకాశానికెత్తాడు. కెప్టెన్‌ ఎప్పుడు అడిగినా లోడెడ్‌ గన్‌లా నిప్పులు చెరిగేందుకు రెడీగా ఉంటాడని కితాబునిచ్చాడు. తాజాగా జరిగిన ఓ  కార్యక్రమంలో సచిన్‌  మాట్లాడుతూ..


సిరాజ్‌ బౌలింగ్‌ రనప్‌ అద్భుతంగా ఉంటుందని, మైదానంలో అతనెప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తాడని, అతను బౌల్‌ చేసేది తొలి ఓవరా లేక అఖరిదా అన్నది గుర్తించలేరని కొనియాడాడు. సిరాజ్‌లో ఈ లక్షణాలు తననెంతో అకట్టుకున్నాయని, గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఇదే తరహా యాటిట్యూడ్‌తో అతను సత్ఫలితాలు సాధించాడని పేర్కొన్నాడు.సిరాజ్‌లో వేగంగా నేర్చుకునే లక్షణం కనిపించిందని, అరంగేట్రం టెస్ట్‌లోనే అనుభవజ్ఞుడిలా బౌల్‌ చేశాడని, సీనియర్ల సలహాలతో మరింత మెరుగయ్యాడని కొనియాడాడు.

దక్షిణాఫ్రికాతో త్వరలో ప్రారంభంకానున్న టెస్ట్‌ సిరీస్‌లో సిరాజ్‌ కీలక బౌలర్‌గా అవతరిస్తాడని జోస్యం చెప్పాడు. కాగా, తనపై క్రికెట్‌ దిగ్గజానికి ఉన్న అభిప్రాయానికి సిరాజ్‌ కృతజ్ఞతలు తెలిపాడు. 'థాంక్యూ సచిన్‌ సర్‌. మీ నుంచి ఇలాంటి మాటలు రావడం నాకెంతో స్ఫూర్తిదాయకం. దేశం కోసం ఎప్పుడూ అత్యుత్తమంగా ఆడేందుకే ప్రయత్నిస్తాను. స్టే వెల్‌ సర్‌' అంటూ ట్వీట్‌ చేశాడు. ఇదిలా ఉంటే, మూడు టెస్ట్‌ల సిరీస్‌ నిమిత్తం ప్రస్తుతం సిరాజ్‌ దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. 
చదవండి: ప్రముఖ బాలీవుడ్‌ నటుడికి దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన కేన్‌ మామ..!

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్