amp pages | Sakshi

క్రీడా మంత్రి పోరాటం వృధా.. భారీ ఆధిక్యం దిశగా మధ్యప్రదేశ్‌

Published on Thu, 06/16/2022 - 18:55

Bengal Vs Madhya Pradesh 1st Semi Final: రంజీ ట్రోఫీ 2022 సీజన్‌లో బెంగాల్‌ పోరాటం ముగిసేలా కనిపిస్తుంది. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్‌లో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 273 పరుగులకే ఆలౌట్‌ కావడంతో ప్రత్యర్ధికి 68 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. 5 వికెట్ల నష్టానికి 197 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన బెంగాల్‌ను సీనియర్‌ ఆటగాడు, ఆ రాష్ట్ర క్రీడా మంత్రి మనోజ్‌ తివారి (211 బంతుల్లో 12 ఫోర్లతో 102‌), బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ షాబాజ్‌ అహ్మద్‌ (209 బంతుల్లో 12 ఫోర్లతో 116‌) శతకాలతో ఆదుకున్నారు.

వీరిద్దరూ అద్భుతమైన పోరాటపటిమను కనబర్చి బెంగాల్‌ను తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దిశగా తీసుకెళ్లారు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరూ ఔటవ్వడంతో బెంగాల్‌ లీడ్‌ సాధించే అవకాశాన్ని కోల్పోయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మధ్యప్రదేశ్‌ను‌.. రజత్‌ పాటిదార్‌ (63 నాటౌట్‌), కెప్టెన్‌ ఆధిత్య శ్రీవత్సవ (34 నాటౌట్‌) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో భారీ ఆధిక్యం దిశగా తీసుకెళ్లారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి 231 పరుగుల ఓవరాల్‌ ఆధిక్యాన్ని సాధించింది. నాలుగో రోజు ఆటలో మధ్యప్రదేశ్‌ మరో 150, 200 పరుగులు చేసినా, తొలి ఇన్నింగ్స్‌ ఆధారంగా ఫైనల్‌కు చేరుకుంటుంది. 

స్కోర్‌ వివరాలు:
మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ 341 ఆలౌట్‌
బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌ 273 ఆలౌట్‌
మధ్యప్రదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌ 163/2
చదవండి: న్యూజిలాండ్‌ జట్టులో కల్లోలం.. మరో స్టార్‌ క్రికెటర్‌కు కరోనా

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)