amp pages | Sakshi

ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో ఓటమి.. పాకిస్తాన్‌కు మరో భారీ షాక్‌

Published on Mon, 12/12/2022 - 15:25

ICC World Test Championship 2021-23 Updated Points Table: ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో 26 పరుగుల తేడాతో ఓటమిపాలై, స్వదేశంలో 0-2 తేడాతో సిరీస్‌ను కోల్పోయిన పాకిస్తాన్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) 2021-23 ఫైనల్‌ రేసు నుంచి ఆ జట్టు అధికారికంగా నిష్క్రమించింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు వరకు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలని ఉవ్విళ్లూరిన పాకిస్తాన్‌.. తాజా ఓటమితో పాయింట్ల పట్టికలో ఐదో స్థానం నుంచి ఆరో ప్లేస్‌కు పడిపోయి నిరాశగా ఫైనల్‌ రేసు నుంచి వైదొలిగింది.  
 
మరోవైపు 22 ఏళ్ల తర్వాత పాక్‌ గడ్డపై సిరీస్‌ కైవసం చేసుకున్న ఇంగ్లండ్‌.. 12 పాయింట్లు ఖాతాలో వేసుకుని, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాక్‌ను వెనక్కునెట్టి ఐదో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుత ఎడిషన్‌లో ఫైనల్‌కు చేరే అవకాశాన్ని ఇదివరకే కోల్పోయిన ఇంగ్లండ్‌.. అద్భుతమైన రీతిలో పుంజుకుని మిగతా జట్లకు షాకిస్తుంది. 

ఇదిలా ఉంటే, విండీస్‌పై స్వదేశంలో 2-0 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుని ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు రెండు, మూడు స్థానాల్లో ఉండగా, టీమిండియా నాలుగో ప్లేస్‌లో కొనసాగుతుంది. ఈ ఏడిషన్‌ రెండో ఫైనల్‌ బెర్త్‌ కోసం టీమిండియా.. సౌతాఫ్రికా, శ్రీలంక జట్లతో పోటీపడుతుంది. ఈ ఏడాది టీమిండియా మరో ఆరు టెస్ట్‌లు ఆడాల్సి ఉండగా.. అన్నింటిలో గెలిస్తే ఫైనల్లో ఆసీస్‌తో తలపడుతుంది.   

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)