amp pages | Sakshi

ఆస్ట్రేలియా ఓపెన్‌ విజేత నయోమి ఒసాకా

Published on Sat, 02/20/2021 - 16:06

మెల్‌బోర్న్‌: జపనీస్‌ టెన్నీస్‌ స్టార్‌ నయోమి ఒసాకా ఆస్ట్రేలియా ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో అమెరికాకు చెందిన జెన్నిఫర్‌ బార్డీ(22వ సీడ్‌)ని 6-4,6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించిన ఒసాకా(3వ సీడ్‌) కెరీర్‌లో రెండోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలుచుకుంది. ఓవరాల్‌గా ఆమె కెరీర్‌లో ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కాగా.. అందులో రెండు యూఎస్‌ ఓపెన్‌(2018, 2020)టైటిల్స్‌తో పాటు రెండు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌(2019,2021) టైటిల్స్‌ ఉన్నాయి.

కాగా నేటి ఫైనల్‌ మ్యాచ్‌‌లో ఒసాకా తన ప్రత్యర్థి బార్డీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. 6-4తో తొలి సెట్‌ను 41 నిమిషాల్లో సొంతం చేసుకున్న ఒసాకా రెండో సెట్‌ను మరో 36 నిమిషాల్లోనే 6-3తో నెగ్గి టైటిల్‌ను సొంతం చేసుకుంది. కాగా కరోనా కారణంగా 2020లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ రద్దు కావడంతో 2021లో జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను వరుసగా రెండోసారి గెలుచుకొని ఒసాకా చరిత్ర సృష్టించింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌