amp pages | Sakshi

స్లెడ్జింగ్‌; గిల్‌ కౌంటర్‌ అదిరింది.. వీడియో వైరల్‌

Published on Fri, 01/08/2021 - 13:26

సిడ్నీ: ఆస్ట్రేలియాతో  జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. శుక్రవారం రెండో రోజు ఆట  ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి  పుజారా(9 బ్యాటింగ్‌),  రహానే(5 బ్యాటింగ్‌)లు క్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్లు రోహిత్‌(26;77 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్‌) ,  శుబ్‌మన్‌ గిల్‌(50;101 బంతుల్లో 8 ఫోర్లు) ల వికెట్లను భారత్‌ చేజార్చుకుంది. కాగా, ఈ రోజు ఆటలో టీమిండియా ఓపెనర్లలను ఆసీస్‌ క్రికెటర్‌ లబూషేన్‌ స్లెడ్జింగ్‌ చేశాడు. ఈ జోడి నిలకడగా ఇన్నింగ్స్‌ను ఆరంభించడంతో ఆసీస్‌ స్లెడ్జింగ్‌కు దిగింది. ఈ క్రమంలోనే ఆ బాధ్యతను లబూషేన్‌ తనపై వేసుకున్నాడు. ప్రధానంగా గిల్‌ను టార్గెట్‌ చేస్తూ అసందర్భమైన ప్రశ్నలు వేశాడు.  

ఫార్వర్డ్‌ షార్ట్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న లబూషేన్‌.. గిల్‌ను ‘నీ ఫేవరెట్‌ క్రికెటర్‌ ఎవరు’ అంటూ ప్రశ్నించడంతో స్లెడ్జింగ్‌ ఆరంభించాడు. స్టార్క్‌ వేసిన రెండో ఓవర్‌లో గిల్‌ను ఫేవరెట్‌ క్రికెటర్‌  ఎవరు అంటూ ప్రశ్నించాడు. దానికి గిల్‌ అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. దానికి సమాధానం కావాలంటే మ్యాచ్‌ ముగిసిన తర్వాత చెబుతాలే అంటూ బదులిచ్చాడు.  అయితే ఆ తర్వాత బంతికి సచిన్‌..లేక విరాట్‌ అంటూ మళ్లీ నిలదీశాడు లబూషేన్‌. ఆపై రోహిత్‌ స్ట్రైకింగ్‌ వచ్చిన తర్వాత కూడా లబూషేన్‌ అదే తరహాలో విసిగించాడు. ‘హేయ్‌.. క్వారంటైన్‌ ఏం చేశావ్‌’ అంటూ రోహిత్‌పై స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆలస్యంగా ఆ గడ్డపై అడుగుపెట్టిన రోహిత్‌ 14 రోజుల పాటు క్వారంటైన్‌లోఉన్నాడు.దీన్ని ఉద్దేశిస్తూ లబూషేన్‌ తన నోటికి పని చెప్పాడు. ఈ వీడియోను క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) తమ ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేయగా, అది వైరల్‌గా మారింది. 

 
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)