ఐపీఎల్‌: పేరు మార్చుకున్న కింగ్స్‌ పంజాబ్‌

Published on Tue, 02/16/2021 - 08:47

న్యూఢిల్లీ: వచ్చే ఐపీఎల్‌ 2021 సీజన్‌కు కొత్త పేరుతో బరిలోకి దిగుతామని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఫ్రాంచైజీ తెలిపింది. తమ జట్టును ఇక నుంచి పంజాబ్‌ కింగ్స్‌ పేరుతో పిలవాలని... పేరులో మార్పును కోరుతూ తాము బీసీసీఐకి దరఖాస్తు చేసుకున్నామని ఆ ఫ్రాంచైజీ తెలిపింది. ఐపీఎల్‌ (2008) ప్రారంభం నుంచి ఈ టోర్నీలో ఆడుతున్న పంజాబ్‌ జట్టు ఒక్కసారీ టైటిల్‌ సాధించలేదు.ఐపీఎల్‌ 14వ సీజన్‌లో కొత్త పేరుతో బరిలోకి దిగనున్న పంజాబ్‌ తలరాత మారుతుందేమో వేచి చూడాలి.

కేఎల్‌ రాహుల్‌ సారధ్యంలోని కింగ్స్‌ పంజాబ్‌ గతేడాది సీజన్‌లో ఆరో స్థానంలో నిలిచింది. కెప్టెన్‌గా రాహుల్‌ 675 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నా.. మిగతా ఆటగాళ్లు ఎవరు ఆశించినరీతిలో ఆకట్టుకోలేదు. ముఖ్యంగా రూ.10 కోట్లు పెట్టి కొన్న ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ తీవ్రంగా నిరాశపరిచాడు. కాగా ఫిబ్రవరి 18న జరగనున్న మినీ ఐపీఎల్‌ వేలానికి అంతా సిద్ధమైన వేళ పంజాబ్‌ జట్టు తమ పర్స్‌లో రూ.52 కోట్లతో వేలంలో పాల్గొననుంది. అయితే బీసీసీఐ సవరించిన తాజా నిబంధనల ప్రకారం పర్స్‌లో 75 శాతం ఆటగాళ్ల కొనుగోలుకు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో పంజాబ్‌ జట్టు రూ. 31.7 కోట్లతో వేలంలో పాల్గొనాల్సి ఉంది. కాగా గతేడాది దారుణ ప్రదర్శన కనబరిచిన మ్యాక్స్‌వెల్‌ సహా పలువురిని రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: కింగ్స్‌ పంజాబ్‌కు ‘వేలం’ కష్టాలు
పాపం పుజారా.. ఎంత పని జరిగిపోయింది

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ