amp pages | Sakshi

ఒక మ్యాచ్‌లో సెంచరీ; మరో మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ.. రెండూ ఒకేరోజు

Published on Sun, 07/18/2021 - 11:15

సౌతాంప్టన్‌: టీ20 బ్లాస్ట్‌ 2021లో భాగంగా హాంప్‌షైర్‌ ఆటగాడు... కెప్టెన్‌ జేమ్స్‌ విన్స్‌ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఒకేరోజు రెండు వేర్వేరు మ్యాచ్‌ల్లో మెరుపు సెంచరీ, హాఫ్‌ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. ముందుగా ససెక్స్‌, హాంప్‌షైర్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో జేమ్స్‌ విన్స్‌ మెరుపు సెంచరీ సాధించాడు. జేమ్స్‌ విన్స్‌ (59 బంతుల్లో 102; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు.

మరో 16 పరుగులు చేస్తే మ్యాచ్‌ గెలుస్తామన్న సమయంలో ఓలి రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో దురదృష్టవశాత్తు హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు. అప్పటికే ససెక్స్‌కు చేయాల్సిన నష్టం చేసే వెళ్లాడు. ఆ తర్వాత జో వెథర్లీ 24 నాటౌట్‌, లూయిస్‌ మెక్‌మనస్‌ 3 నాటౌట్‌ మిగతా పనిని పూర్తి చేశారు. మరో ఓపెనర్‌ డీ ఆర్సీ షార్ట్‌ 35 పరుగులతో ఆకట్టుకున్నాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ససెక్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. రవి బొపారా 62, లూక్‌ రైట్‌ 54 పరుగులు చేశారు. 

ఇక హాంప్‌షైర్‌ ఈసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ జేమ్స్‌ విన్స్‌ అర్థసెంచరీతో మెరవడం విశేషం. ఈ మ్యాచ్‌లోనూ విన్స్‌ టాప్‌ స్కోరర్‌గా నిలవడం.. హాంప్‌షైర్‌ మరో విజయాన్ని అందుకోవడం మరో విశేషం. ముందుగా బ్యాటింగ్‌ చేసిన హాంప్‌షైర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. విన్స్‌ 63, డీ ఆర్సీ షార్ట్‌ 30, గ్రాండ్‌హోమ్‌ 32 పరుగులు సాధించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఈసెక్స్‌ 153 పరుగులకే ఆలౌట్‌ అయింది. డానియెల్‌ లారెన్స్‌ 60, టామ్‌ వెస్లీ 39 మినహా మరెవరు రాణించలేకపోయారు.

ఇక జేమ్స్‌ విన్స్‌కు ఈ వారం అత్యుత్తమంగా కలిసొచ్చిందని చెప్పొచ్చు. విన్స్‌ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు ఫిఫ్టీలు, రెండు సెంచరీలు అందుకున్నాడు. పాకిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో సెంచరీతో దుమ్మురేపిన విన్స్‌.. అదే జట్టుతో జరిగిన మరో వన్డేలో హాఫ్‌ సెంచరీ సాధించాడు.  తాజాగా టీ20 బ్లాస్ట్‌లో వరుస మ్యాచ్‌ల్లో హాఫ్‌ సెంచరీ, సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 

Videos

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)