amp pages | Sakshi

IPL 2022: రసెల్‌ విధ్వంసం

Published on Sat, 04/02/2022 - 04:26

ముంబై: సుదీర్ఘకాలం తర్వాత ఆండ్రీ రసెల్‌ తనదైన శైలిలో తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడటంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌)కు ఐపీఎల్‌లో రెండో విజయం దక్కింది. శుక్రవారం జరిగిన పోరులో కేకేఆర్‌ 6 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ 18.2 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది.

భానుక రాజపక్స (9 బంతుల్లో 31; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా... కగిసో రబడ (16 బంతుల్లో 25; 4 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక పరుగులు జోడించాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఉమేశ్‌ యాదవ్‌ (4/23) నాలుగు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం కోల్‌కతా 14.3 ఓవర్లలో 4 వికెట్లకు 141 పరుగులు చేసి గెలిచింది. ఆండ్రీ రసెల్‌ (31 బంతుల్లో 70 నాటౌట్‌; 2 ఫోర్లు, 8 సిక్స్‌లు) విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు.  

సమష్టి వైఫల్యం...
శివమ్‌ మావి వేసిన ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌... తొలి నాలుగు బంతుల్లో వరుసగా 4, 6, 6, 6 బాదిన రాజపక్స... ఐదో బంతికి అవుట్‌! పదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రబడ ఒకదశలో వరుసగా తాను ఎదుర్కొన్న ఆరు బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో చెలరేగాడు! పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో ఈ రెండూ మినహా చెప్పుకునేందుకు ఏమీ లేదు. తొలి ఓవర్లోనే మయాంక్‌ (1) వెనుదిరగ్గా, ధావన్‌ (16) విఫలమయ్యాడు. లివింగ్‌స్టోన్‌ (19),షారుఖ్‌ (0) ప్రభావం చూపలేదు. 102/8తో ఉన్న పంజాబ్‌ స్కోరు చివర్లో రబడ దూకుడుతో 137 వరకు చేరింది.   

మెరుపు బ్యాటింగ్‌...
ఛేదనలో కోల్‌కతా కూడా తడబడింది. ఓపెనర్లు రహానే (12), వెంకటేశ్‌ (3) విఫలమయ్యారు. శ్రేయస్‌ అయ్యర్‌ (15 బంతుల్లో 26; 5 ఫోర్లు) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా ఎక్కువసేపు నిలవకపోగా, వెంటనే నితీశ్‌ రాణా (0) డకౌటయ్యాడు. స్కోరు 51/4 వద్ద నిలిచిన ఈ దశలో బిల్లింగ్స్, రసెల్‌ భాగస్వామ్యం జట్టును విజయం దిశగా నడిపించింది. ముఖ్యంగా రసెల్‌ సిక్సర్ల జోరులో పంజాబ్‌ కుదేలైంది. హర్‌ప్రీత్‌ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన రసెల్‌... స్మిత్‌ ఓవర్లో ఏకంగా 3 సిక్సర్లు, ఒక ఫోర్‌ బాదాడు. 26 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రసెల్‌... లివింగ్‌స్టోన్‌ వేసిన 15వ ఓవర్లో రెండు వరుస సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించాడు.   

ఒకే ఓవర్లో 30 పరుగులు!
ఒడెన్‌ స్మిత్‌ వేసిన ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లో రసెల్‌ చెలరేగిపోయాడు. అతను వరుస బంతుల్లో 4, 6, 6, 0, 6, 1 (+నోబాల్‌) పరుగులు చేయగా, తర్వాతి బంతికి బిల్లింగ్స్‌ సిక్స్‌ కొట్టడంతో మొత్తం 30 పరుగులు వచ్చాయి.

స్కోరు వివరాలు:
పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: మయాంక్‌ (ఎల్బీ) (బి) ఉమేశ్‌ 1; ధావన్‌ (సి) బిల్లింగ్స్‌ (బి) సౌతీ 16; రాజపక్స (సి) సౌతీ (బి) మావి 31; లివింగ్‌స్టోన్‌ (సి) సౌతీ (బి) ఉమేశ్‌ 19; రాజ్‌ బావా (బి) నరైన్‌ 11; షారుఖ్‌ (సి) రాణా (బి) సౌతీ 0; హర్‌ప్రీత్‌ (బి) ఉమేశ్‌ 14; ఒడెన్‌ స్మిత్‌ (నాటౌట్‌) 9; రాహుల్‌ చహర్‌ (సి) రాణా (బి) ఉమేశ్‌ 0; రబడ (సి) సౌతీ (బి) రసెల్‌ 25; అర్‌‡్షదీప్‌ (రనౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్‌) 137. 
వికెట్ల పతనం: 1–2, 2–43, 3–62, 4–78, 5–84, 6–92, 7–102, 8–102, 9–137, 10–137.
బౌలింగ్‌: ఉమేశ్‌ 4–1–23–4, సౌతీ 4–0–36–2, శివమ్‌ మావి 2–0–39–1, వరుణ్‌ 4–0–14–0, నరైన్‌ 4–0–23–1, రసెల్‌ 0.2–0–0–1.  

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: రహానే (సి) స్మిత్‌ (బి) రబడ 12; వెంకటేశ్‌ (సి) హర్‌ప్రీత్‌ (బి) స్మిత్‌ 3; శ్రేయస్‌ (సి) రబడ (బి) చహర్‌ 26; బిల్లింగ్స్‌ (నాటౌట్‌) 24; రాణా (ఎల్బీ) (బి) చహర్‌ 0; రసెల్‌ (నాటౌట్‌) 70; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (14.3 ఓవర్లలో 4 వికెట్లకు) 141. 
వికెట్ల పతనం: 1–14, 2–38, 3–51, 4–51.
బౌలింగ్‌: అర్‌‡్షదీప్‌ 3–0–32–0, రబడ 3–0–23–1, ఒడెన్‌ స్మిత్‌ 2–0–39–1, రాహుల్‌ చహర్‌ 4–1–13–2, హర్‌ప్రీత్‌ 2–0–20–0, లివింగ్‌స్టోన్‌ 0.3–0–13–0.

ఐపీఎల్‌లో నేడు
ముంబై ఇండియన్స్‌ X రాజస్తాన్‌ రాయల్స్‌
వేదిక: ముంబై, మధ్యాహ్నం గం. 3:30 నుంచి
గుజరాత్‌ టైటాన్స్‌ X ఢిల్లీ క్యాపిటల్స్‌
వేదిక: పుణే, రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌