కోహ్లి రికార్డు బద్దలు కాలేదు.. రాజస్తాన్‌ ఓపెనర్‌ది చరిత్రే

Published on Sun, 05/29/2022 - 22:20

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో రాజస్తాన్‌ ఓపెనర్‌ జాస్‌ బట్లర్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. రాజస్తాన్‌ రాయల్స్‌ ఫైనల్‌ వరకు వచ్చిందంటే అందులో బట్లర్‌ పాత్ర కీలకమనే చెప్పొచ్చు. ఒక రకంగా  ఆ జట్టు బ్యాటింగ్‌ బట్లర్‌పైనే ఆధారపడి ఉంది. అతను రాణిస్తే జట్టు గెలవడం.. రాణించని రోజున ఓడిపోవడం జరిగింది. తాజాగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరుగుతున్న ఫైనల్లో జాస్‌ బట్లర్‌ పెద్దగా పరుగులు చేయలేకపోయాడు.

క్వాలిఫయర్‌-2లో సెంచరీతో మెరిసిన బట్లర్‌ అదే జోరును గుజరాత్‌పై చూపించలేకపోయాడు. 39 పరుగులు చేసి హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో సాహాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు బట్లర్‌ మరో సెంచరీ సాధిస్తాడని.. కోహ్లి రికార్డు బ్రేక్‌ చేస్తాడని అంతా భావించారు. కానీ బట్లర్‌ 39 పరుగుల వద్దే ఔట్‌ కావడంతో కోహ్లి రికార్డు కొట్టలేకపోయాడు. అయితే కోహ్లి రికార్డు బ్రేక్‌ చేయలేకపోయినప్పటికి బట్లర్‌ ఐపీఎల్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు.

17 మ్యాచ్‌ల్లో 863 పరుగులతో డేవిడ్‌ వార్నర్‌ను(848 పరుగులు, 2016లో) దాటిన బట్లర్‌ లీగ్‌ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. తొలి స్థానంలో కోహ్లి(2016లో 973 పరుగులు), మూడో స్థానంలో డేవిడ్‌ వార్నర్‌(2016లో 848 పరుగులు), కేన్‌ విలియమ్సన్‌(2018లో 735 పరుగులు) నాలుగో స్థానంలో ఉండగా.. క్రిస్‌ గేల్‌(2012లో 733 పరుగులు), మైక్‌ హస్సీ(2013లో 733 పరుగులు) ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నారు. ఇక బట్లర్‌ విఫలం కావడంతో రాజస్తాన్‌ ఫైనల్లో తక్కువ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది.

చదవండి: Hardik Pandya-Ravi Shastri: ఇద్దరి బంధం ఎంతో ప్రత్యేకం.. అపూర్వ కలయిక 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ