amp pages | Sakshi

సన్‌రైజర్స్‌కు  బిగ్‌ షాక్‌.. ఇంటి దారి పట్టిన స్టార్‌ ఆల్‌రౌండర్‌

Published on Fri, 09/24/2021 - 14:02

Sherfane Rutherford Returns Home From IPL: వరుస పరాజయాలతో ప్లే ఆఫ్‌ ఆశలను దాదాపుగా గల్లంతు చేసుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు(ఎస్‌ఆర్‌హెచ్‌) మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జానీ బెయిర్‌స్టో స్థానంలో ఇటీవలే (ఐపీఎల్‌-2021 రెండో దశ) జట్టులోకి వచ్చిన విండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షెర్ఫాన్‌ రూథర్‌ఫర్డ్‌.. తన తండ్రి కన్నుమూయడంతో స్వదేశానికి తిరుగు పయనమయ్యాడు. ఈ సీజన్‌లో ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క విజయం నమోదు చేసి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇది గట్టి ఎదురుదెబ్బే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

కాగా, రెండో దశ తొలి మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఎస్‌ఆర్‌హెచ్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు లీగ్‌కు దూరమయ్యారు. కరోనా బారిన పడడంతో స్టార్ బౌలర్ నటరాజన్ జట్టుకు దూరం కాగా, అతనితో సన్నిహితంగా మెలిగిన విజయ్ శంకర్ కూడా ఐసొలేషన్‌లోకి వెళ్లాడు. తాజాగా రూథర్‌ఫర్డ్‌ కూడా లీగ్‌కు దూరం కావడంతో ఈ ముగ్గురి స్థానాలను ఎవరు భర్తీ చేస్తారోనని ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఇదిలా ఉంటే, రెండో దశ తొలి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేయగా.. ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్లు మాత్రమే నష్టపోయి మరో 13 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా డీసీ జట్టు 8 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని నమోదు చేసింది. కాగా, శనివారం(సెప్టెంబర్‌ 25) జరుగబోయే తమ తదుపరి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది.
చదవండి: అలా జరిగితే అఫ్గాన్‌ జట్టును బహిష్కరిస్తాం.. ఐసీసీ వార్నింగ్‌

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌