amp pages | Sakshi

కర్ణాటక బ్యాటర్‌తో భారత మహిళా క్రికెటర్‌ 'ఎంగేజ్‌మెంట్‌'.. ఫొటోలు వైరల్‌

Published on Mon, 09/12/2022 - 14:14

భారత మహిళా క్రికెటర్‌ వేదా కృష్ణమూర్తి, కర్ణాటక బ్యాటర్‌ అర్జున్‌ హొయసాల త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. గత కొం‍త కాలంగా ప్రేమలో మునిగితేలుతున్న వీరిద్దరూ ఆదివారం నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ క్రికెటర్లు ఇద్దరూ ఈ విషయాన్ని తమ సోషల్‌ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.

అదే విధంగా తమ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోల్లో అర్జున్ మోకాళ్లపై కూర్చుని చాలా రొమాంటిక్‌గా వేదాకు ప్రపోజ్ చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా వెటరన్‌ క్రికెటర్ వేదా టీమిండియా తరపున 48 వన్డేలు, 76 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించింది. వేదా 2017 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన భారత జట్టులోనూ.. 2020 టీ20 ప్రపంచకప్‌ జట్టులో కూడా భాగంగా ఉంది. కాగా గత కొంత కాలంగా భారత జట్టుకు వేదా దూరంగా ఉంది.

చదవండి: Asia Cup 2022: ఛాంపియన్‌ శ్రీలంకకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..?

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌