amp pages | Sakshi

ఫ్లయింగ్‌ కింగ్‌ 'కోహ్లి'.. కళ్లు చెదిరే క్యాచ్‌తో అబ్బురపరిచిన టీమిండియా మాజీ కెప్టెన్‌

Published on Sun, 12/04/2022 - 18:26

Virat Kohli: పరుగుల యంత్రం, బ్యాటింగ్‌ కింగ్‌ విరాట్‌ కోహ్లి.. ఫీల్డింగ్‌లోనూ కింగ్‌ అనిపించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో ఇవాళ (డిసెంబర్‌ 4) జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లి ఓ అద్భుతమైన క్యాచ్‌ అందుకుని ఔరా అనిపించాడు. వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 23వ ఓవర్‌ 3వ బంతికి కళ్లు చెదిరే ఫ్లయింగ్‌ క్యాచ్‌ అందుకున్న కోహ్లి.. అప్పటికే సెట్‌ అయిన కీలక ప్లేయర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ (29)ను పెవిలియన్‌కు సాగనంపాడు. విరాట్‌ విన్యాసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. కోహ్లి బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ కింగేనని అభిమానులు అభినందిస్తున్నారు.    

కాగా, ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. బంగ్లా బౌలర్లు షకీబ్‌ అల్‌ హసన్‌ (5/36), ఎబాదత్‌ హొస్సేన్‌ (4/47) దెబ్బకు 186 పరుగులకే (41.2 ఓవర్లలో) చాపచుట్టేసింది. భారత బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌ (70 బంతుల్లో 73; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మినహా అందరూ దారుణంగా విఫలమయ్యారు. శిఖర్‌ ధవన్‌ (7), కోహ్లి (9), షాబాజ్‌ అహ్మద్‌ (0), శార్ధూల్‌ ఠాకూర్‌ (2), దీపక్‌ చాహర్‌ (0), సిరాజ్‌ (9) పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (27), శ్రేయస్‌ అయ్యర్‌ (24), వాషింగ్టన్‌ సుందర్‌ (19) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేయగలిగారు.

అనంతరం 187 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. టీమిండియా బౌలర్ల ధాటికి 38.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేసి ఓటమి దిశగా పయనిస్తుంది. బంగ్లా గెలవాలంటే 70 బంతుల్లో మరో 53 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్‌లో కొత్త బ్యాటర్లు మెహిది హసన్‌ (0), ఎబాదత్‌ హొస్సేన్‌ (0) ఉన్నారు. భారత బౌలర్లలో సుందర్‌, సిరాజ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. దీపక్‌ చాహర్‌, కుల్దీప్‌ సేన్‌, శార్దూల్‌ ఠాకూర్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.  

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)