amp pages | Sakshi

10 నిమిషాలు మైండ్‌ బ్లాక్‌: కుల్దీప్‌

Published on Thu, 08/13/2020 - 14:37

న్యూఢిల్లీ:  దాదాపు మూడేళ్ల క్రితం భారత క్రికెట్‌ జట్టులోకి అరంగేట్రం చేసిన చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తన మార్కు స్పిన్‌తో రెగ్యులర్‌ సభ్యుడిగా మారిపోయాడు. 2014లో యూఏఈలో జరిగిన అండర్‌-19 వరల్డ్‌కప్‌లో రాణించడంతో కుల్దీప్‌ యాదవ్‌ ఒక్కసారిగా జాతీయ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. కానీ 2017లో అతని అరంగేట్రం షురూ అయ్యింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ ద్వారా కుల్దీప్‌ టెస్టు అరంగేట్రం జరిగింది. అయితే ఆ సమయంలోనే దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ను కలిసే కుల్దీప్‌కు లభించింది. అప్పుడు టీమిండియా కోచ్‌గా ఉన్న అనిల్‌ కుంబ్లే.. కుల్దీప్‌ను వార్న్‌కు పరిచయం చేశాడంట. తాను వార్న్‌ను కలుస్తానంటూ అనిల్‌ భాయ్‌ను కోరి మరీ కలిశానంటూ కుల్దీప్‌ తెలిపాడు. టీవీ ప్రెజెంటర్‌ మడోనా టిక్సియారా ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌చాట్‌లో పాల్గొన్న కుల్దీప్‌.. ఈ విషయాన్ని వెల్లడించాడు. అదొక మధుర జ్ఞాపకంగా పేర్కొన్న కుల్దీప్‌.. వార్న్‌తో తన బౌలింగ్‌ గురించి చాలా విషయాలను చెప్పినట్లు తెలిపాడు. (మరో రెండేళ్లు ‘కింగ్స్‌’లో ధోని)

‘నేను పుణెలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో వార్న్‌ను కలిశా. వార్న్‌ను కలవడం అదే తొలిసారి. ఆసమయంలో మాకు ప్రధాన కోచ్‌గా అనిల్‌ కుంబ్లే భాయ్‌ ఉన్నారు. షేన్‌ వార్న్‌ను కలిసి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నట్లు కుంబ్లేకు చెప్పా. చివరికు కుంబ్లే సాయంతో వార్న్‌ను కలిశా. కానీ పది నిమిషాలు ఏమీ మాట్లాడలేకపోయా. వార్న్‌ కలిశాక మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. కుంబ్లే-వార్న్‌లు మాట్లాడుకుంటూ ఉంటే చాలాసేపు అలా వింటూనే ఉన్నా. చివరగా మాట్లాడం ఆరంభించా. చాలా విషయాలను వార్న్‌తో పంచుకున్నా. నా భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి అనేది వార్న్‌కు చెప్పుకొచ్చా.

వికెట్‌కు రెండు వైపులా బంతిని ఎలా సంధిస్తాను అనే విషయాన్ని వార్న్‌కు వివరించా. అయితే అంతా విన్న వార్న్‌.. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావ్‌ అని అన్నాడు. కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్‌ వార్న్‌ తెలిపాడు. బ్యాట్స్‌మన్‌ మదిలో ఏమి ఆలోచిస్తూ ఉండవచ్చు అనే దానిని ఊహిస్తూ బౌలింగ్‌ చేయమని వార్న్‌ సలహా ఇచ్చాడు’ అని కుల్దీప్‌ తెలిపాడు. కాగా, ఆ తర్వాత వార్న్‌ను చాలాసార్లు కలిసే అవకాశం దక్కిందన్నాడు. ఐపీఎల్‌లో కేకేఆర్‌కు ఆడుతుండగా వార్న్‌ కామెంటేటర్‌గా ఉండగా కలిసే అవకాశం దొరికిందన్నాడు. ఒక కోచ్‌ ఎలా అయితే చెబుతాడో అలానే పలు విషయాల్ని వార్న్‌ తనకు చెప్పాడన్నాడు. అవి తన కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కుల్దీప్‌ పేర్కొన్నాడు.(మరో ‘హోరాహోరీ’కి రంగం సిద్ధం)

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)