అసలు సూర్యకుమార్‌ భూమిపైనే ఆడుతున్నాడా..? దినేశ్‌ కార్తీక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Mon, 01/24/2022 - 21:03

Dinesh Karthik Backs Surya Kumar Yadav: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఆఖరి వరకు పోరాడి 4 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌.. 0-3 తేడాతో చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 287 పరుగులకు ఆలౌట్‌ కాగా.. టీమిండియా మరో నాలుగు బంతులు మిగిలుండగానే 283 పరుగుల వద్ద ఆలౌటైంది. ధవన్‌(61), కోహ్లి(65), దీపక్‌ చాహర్‌(54) అర్ధ సెంచరీలు చేయగా.. సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన సూర్యకుమార్‌ యాదవ్‌(32 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్‌) పర్వాలేదనిపించాడు. 

కాగా, ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ బ్యాటింగ్‌ చేసిన విధానంపై టీమిండియా వెటరన్‌ వికెట్‌కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూర్య.. అద్భుతమైన టచ్‌లో ఉన్నట్లు కనిపించాడని, అతనాడిన షాట్లను చూస్తే అతను భూమిపై ఆడుతున్నాడా..? లేక ఇతర గ్రహంపై ఆడుతున్నాడా అన్నట్లు అనిపించిందని వ్యాఖ్యానించాడు. నాలుగు వికెట్లు పడిపోయిన కీలక తరుణంలో వచ్చి 120కి పైగా స్ట్రయిక్‌ రేట్‌తో అద్భుతమైన షాట్లు ఆడుతూ.. జట్టును గెలిపించేలా కనిపించాడని కితాబునిచ్చాడు. అయితే దురదృష్టవశాత్తు అతను ఔట్‌ కావడం, ఆఖర్లో దీపక్‌ చాహర్‌కు సరైన సహకారం లభించకపోవడం, టీమిండియా స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగిందన్నాడు.  

అయితే ఈ మ్యాచ్‌లో కూడా సూర్య గతంలో మాదిరే ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపించాడని, అద్భుతమైన భంగిమల్లో పర్ఫెక్ట్‌ షాట్లు ఆడాడని, ఒత్తిడి ఛాయలు కనబడకుండా కూల్‌గా ఆడాడని కొనియాడాడు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం గమనించాలని, అకారణంగా అతన్ని జట్టు నుంచి తప్పించకుండా తగినన్ని అవకాశాలు కల్పిస్తే ఊహకందని అద్భుతాలు చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.  

కాగా, టీమిండియా తరఫున 4 వన్డేలు, 11 టీ20లు ఆడిన సూర్యకుమార్‌.. జట్టులో స్థిరమైన స్థానం కోసం గత కొంతకాలంగా తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాడు. అతని స్థానానికి యువ ఆటగాళ్ల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఆల్‌రౌండర్‌ కోటాలో వెంకటేశ్‌ అయ్యర్‌ జట్టులోకి రావడంతో సూర్యకుమార్‌కు తొలి రెండు వన్డేల్లో అవకాశం రాలేదు. 
చదవండి: దక్షిణాఫ్రికా చేతిలో ఓట‌మిపై టీమిండియా హెడ్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

Videos

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

మన ప్రశ్నలకు బాబు, పురందేశ్వరి, పవన్ కు పిచ్చి, పిచ్చి కోపం వస్తుందంటా..!

వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..!

కొడాలి నాని ఎన్నికల ప్రచారం.. బ్రహ్మరథం పట్టిన గుడివాడ ప్రజలు

జనంతో కిక్కిరిసిన మైదుకూరు

Photos

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)