జడేజా కమ్‌బ్యాక్‌ ఇవ్వనున్నాడా!

Published on Tue, 12/22/2020 - 08:51

అడిలైడ్ ‌: మెల్‌బోర్న్‌ టెస్టులో ఐదుగురు స్పెషలిస్ట్‌ బౌలర్లతో ఆడాలని భారత్‌ భావిస్తే తుది జట్టులో రవీంద్ర జడేజా వచ్చే అవకాశం ఉంది. తొలి టి20 మ్యాచ్‌లో కన్‌కషన్‌కు గురైన తర్వాత కోలుకున్న జడేజా తన ప్రాక్టీస్‌ కొనసాగిస్తున్నాడు. అయితే అతను వంద శాతం ఫిట్‌గా ఉన్నాడా లేదా అనేది తేలలేదు. పెద్ద సంఖ్యలో ఓవర్లు బౌలింగ్‌ చేసే స్థాయిలో అతను ఫిట్‌గా ఉంటే మాత్రం ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి స్థానంలో జడేజాను తీసుకోవాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది.

‘విహారిని పక్కన పెట్టాలనుకోవడానికి అతని వైఫల్యం కారణం కాదు. జట్టు కాంబినేషన్‌ కోసం ఆల్‌రౌండర్‌గా జడేజా సరిపోతాడు. ఇటీవల అతని బ్యాటింగ్‌ చాలా మెరుగుపడింది. పైగా లైనప్‌లో ఏకైన ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్‌గా అతను ప్రత్యేకత చూపించగలడు’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు సిడ్నీలో రోహిత్‌ శర్మ క్వారంటైన్‌ కొనసాగుతోంది. అయితే కరోనా కారణంగా ఆ్రస్టేలియా దేశంలో కొత్త నిబంధనలు వస్తుండటంతో రెండో టెస్టు జరిగే మెల్‌బోర్న్‌కు రోహిత్‌ను పంపరాదని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. షెడ్యూల్‌ ప్రకారం మూడో టెస్టు సిడ్నీలోనే జరిగితే రోహిత్‌కు ఇబ్బంది ఉండదు. వేదిక బ్రిస్బేన్‌కు మారితే మాత్రం బీసీసీఐ రోహిత్‌ కోసం మళ్లీ ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ