amp pages | Sakshi

విష్ణు విశాల్‌తో గుత్తా జ్వాల ఎంగేజ్‌మెంట్

Published on Mon, 09/07/2020 - 14:48

భారత బ్యాడ్మింటన్ సీనియర్ ప్లేయర్ గుత్తా జ్వాలతో తనకి ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు తమిళ హీరో విష్ణు విశాల్ సోమవారం ప్రకటించారు. గత రెండేళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంట.. గుత్తా జ్వాల పుట్టిన రోజు (సెప్టెంబరు 7) సందర్భంగా ఒకటయ్యింది. ఈ మేరకు ఉంగరాలు మార్చుకున్న ఫొటోల్ని విష్ణు విశాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో పాటు ‘హ్యాపీ బర్త్‌డే గుత్త జ్వాల.. జీవితానికి కొత్త ఆరంభం.. సానుకూలంగా ఉందాం. మన భవిష్యత్తుతో పాటు ఆర్యన్‌, మన కుటుంబాలు, స్నేహితులు, మన చుట్టూ ఉన్న జనాల భవిష్యత్తు ఉత్తమంగా ఉండేందుకు కృషి చేద్దాం. కొత్త ఆరంభానికి మీ అందరి ఆశీర్వాదం, ప్రేమ మాకు కావాలి. అర్థరాత్రి ఉంగరాన్ని ఏర్పాటు చేసిన బసంత్‌జైన్‌కు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్‌ చేశారు విష్టు విశాల్‌. (చదవండి: స్వీట్‌ షాక్)

వాస్తవానికి విష్ణు విశాల్‌కి 2010లోనే వివాహమయ్యింది. రజనీ నటరాజన్‌ అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఆర్యన్ అనే కొడుకు కూడా ఉన్నాడు. కానీ.. మనస్పర్థలు కారణంగా 2018లో వారిద్దరు విడిపోయారు. మరోవైపు గుత్తా జ్వాలకి కూడా భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌తో 2005లో వివాహమైంది. కానీ.. వీరిద్దరూ 2011లో విడిపోయారు. విష్ణు- జ్వాల దేశంలో కరోనా కేసులు తగ్గిన తర్వాత వివాహం చేసుకోవాలని భావిస్తున్నారు. విశాల్ సోదరి సంగీత్ వేడుకలో తొలిసారి వీరిద్దరు కలిశారు. అప్పుడు వీరి మధ్య చిగురించిన స్నేహం ఆ తరవాత ప్రేమగా మారింది. ఇక కెరీర్ విషయానికి విష్ణు విశాల్ నటించిన థ్రిల్లర్ మూవీ విడుదలకి సిద్ధమవుతోంది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌