amp pages | Sakshi

స్విమ్మర్‌ షేక్‌ ఖాజా మొహిద్దీన్‌ విజయగాథ

Published on Wed, 05/18/2022 - 20:22

బతుకుబాటలో కష్టాలకు ఎదురు ఈదుతూనే అంతర్జాతీయ స్థాయిలో మెరిశాడు ఈ యువకుడు. 12 ఏళ్ల వయసులో సరదాగా ప్రారంభించిన ఈతలో అసమాన ప్రతిభ చూపి ఎన్నో పతకాలు సొంతం చేసుకుంటున్నాడు. అందరిచేత శభాష్‌ షేక్‌ ఖాజా మొహిద్దీన్‌ అనింపించుకుంటున్నాడు. 

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): అది 2003. కాకుమాను మండలం చినలింగాయపాలెం ప్రభుత్వ పాఠశాలలో చదువుతుండగా షేక్‌ ఖాజా మొహిద్దీన్‌ దగ్గరలోని లక్ష్మీపురం బకింగ్‌హామ్‌ కాలువలో సరదాగా స్నేహితులతో కలిసి కేరింతలు కొడుతూ ఈత కొట్టేవాడు. మిగతా వారి కంటే వేగంగా ఈదడం గమనించిన పీఈటీ మనోహర్‌ మొహిద్దీన్‌ను ప్రోత్సహించారు. నిత్యం సాధన చేస్తే అంతర్జాతీయ స్విమ్మర్‌వి అవుతావని వెన్నుతట్టారు. ఆ మాట మొహిద్దీన్‌ మదిలో బలంగా నాటుకుపోయింది. అంతే అప్పటి నుంచి ఇంకా అతను ఈతను ఆపలేదు. 
  
కష్టాలను అధిగమించి
 ఖాజా స్వస్థలం కాకుమాను మండలం చందోలు. ప్రస్తుతం గుంటూరులోనే స్థిరపడ్డాడు. తండ్రి చిరుద్యోగి. అతి సామాన్య కుటుంబం. నిత్యం ఈత సాధనతో మంచి ప్రావీణ్యం సాధించిన ఖాజా అనేక పోటీల్లో పతకాలు సాధించాడు. ఈ తరుణంలోనే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాడు.  వెంటనే కుటుంబ బాధ్యతలు ఒక్కసారిగా మీదపడడంతో ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. అయినా వెనుకడుగు వేయలేదు. నిత్య సాధనతో ప్రతిభ కనబరుస్తూనే ఉన్నాడు. విద్యావంతురాలైన భార్య సహకారంతో ముందుకు సాగుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాడు.

ఈత శిక్షకుడిగా మారినా ఆశించిన జీతభత్యాలు లేవు. కరోనా కష్టకాలంలో దాదాపు రెండేళ్లు స్విమ్మింగ్‌ పూల్స్‌ అన్నీ మూసేశారు. ఈ సమయంలో ఖాజా మంచితనం, స్నేహితుల అండదండలు అతడిని ముందుకు నడిపించాయి. ప్రస్తుతం ఖాజా జీఎంసీ స్విమ్మింగ్‌ పూల్‌లో శిక్షకుడిగా పనిచేస్తున్నాడు. దీంతోపాటు గుంటూరులో ప్రముఖులకు శిక్షకుడిగానూ మారారు. ఎందరి నుంచో అభినందనలు పొందారు.  


మొహిద్దీన్‌ సాధించిన విజయాలు 

► అంతర్జాతీయంగా : 2018లో ఖజికిస్తాన్‌లో జరిగిన ఇండో– ఖజక్‌ మాస్టర్స్‌ ఇన్విటేషన్‌ ఇంటర్నేషనల్‌ పోటీల్లో నాలుగు బంగారు పతకాలు. ఒక రజతం. 
► అదే ఏడాది మలేషియాలో జరిగిన ఫస్ట్‌ ఏషియన్‌ పసిఫిక్‌ మాస్టర్స్‌ గేమ్స్‌లో రెండు బంగారు పతకాలు, ఒక కాంస్యం.  
► 2019లో టర్కీలో జరిగిన టర్కీ స్విమ్మింగ్‌ ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ వింటర్‌ పోటీల్లో ఐదు రజతాలు, రెండు కాంస్యాలు. 
► 2020లో దుబాయ్‌లో జరిగిన  3వ ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో నాలుగు బంగారు పతకాలు. 
► 2022 గత నెల చివరిలో గోవాలో జరిగిన 4 కిలోమీటర్ల సీ స్విమ్మింగ్‌ పోటీల్లో ప్రథమ స్థానం.  
► ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో మొత్తం 10 బంగారు, ఆరు రజతాలు, ఏడు కాంస్యాలు. 
► జాయతీ స్థాయిలో 10 బంగారు, 11 రజతాలు, ఏడు కాంస్యాలతోపాటు రాష్ట్ర స్థాయిలో 50కిపైగా పతకాలు.  

చివరి శ్వాస వరకూ..  
మా మాస్టారు వల్ల నేను స్విమ్మర్‌ అయ్యాను. అనూహ్య విజయాలు సాధించాను. దీనికి నా కుటుబంతోపాటు ఎంతోమంది సహాయసహకారాలు కారణం. ఈత కొలను ఎన్నో జీవిత సత్యాలు నేర్పింది. ఈత మధ్యలో ఆపితే ప్రాణం ఎలా ఆగిపోతుందో.. జీవితంలో పోరాటం ఆపినా అది ముగిసిపోతుంది. అందుకే నా చివరి శ్వాస వరకు ఈత కొలనే నా జీవితం. ఇప్పటికీ ఆర్థికంగా నిలదొక్కుకోలేదు. ప్రభుత్వం చిన్న ఉద్యోగం ఇప్పించి 
ఆదుకోవాలని మనవి. 
– ఖాజా మొహిద్దీన్, అంతర్జాతీయ స్విమ్మర్‌ 

Videos

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు

దొంగలు దొరికారు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌