amp pages | Sakshi

కోచ్‌పై సాహా సంచలన వ్యాఖ్యలు.. ద్రవిడ్‌ రిటైర్‌మెంట్‌ సలహా ఇచ్చాడని ఆవేదన

Published on Sun, 02/20/2022 - 12:23

స్వదేశంలో శ్రీలంకతో జరిగే టెస్ట్‌ సిరీస్‌కు భారత జట్టును శనివారం బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ ప్రకటించిన జట్టులో టీమిండియా వెటరన్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్ సాహాకి చోటు దక్కలేదు.  ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్‌పై వృద్ధిమాన్ సాహా సంచలన వాఖ్యలు చేశాడు. టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్ ద్రవిడ్ తనను ఇకపై ఎంపిక కోసం పరిగణించనందున "రిటైర్మెంట్" గురించి ఆలోచించమని సలహా ఇచ్చినట్టు సాహా తెలిపాడు. కాగా శ్రీలంకతో టెస్టులకు జట్టు ఎంపికలో సాహాను పరిగణినలోకి తీసుకోవడం లేదని ముందే అతడికి టీమ్ మేనేజ్‌మెంట్ చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే అతడు  రంజీ ట్రోఫీ నుంచి వైదొలిగినట్లు సమాచారం.

"ఇక నుంచి జట్టు ఎంపికలో  నన్ను పరిగణించబోమని టీమ్ మేనేజ్‌మెంట్ నాకు చెప్పింది. కోచ్ రాహుల్ ద్రవిడ్  నాకు రిటైర్మెంట్ గురించి ఆలోచించమని సూచించాడు. గత నవంబర్‌లో కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో నేను పెయిన్‌ కిల్లర్‌ మాత్రలు తీసుకుని అజేయంగా 61 పరుగులు చేసినపుడు  బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నన్ను అభినందించారు. బీసీసీఐ అధ్యక్షుడుగా తను ఉన్నంత కాలం జట్టులో నా స్ధానం గురించి ఆందోళన చెందవద్దని గంగూలీ  నాకు హామీ ఇచ్చారు. బోర్డు అధ్యక్షుడి నుంచి అటువంటి భరోసా రావడంతో నేను చాలా సంతోష పడ్డాను. అయితే ఇంతలోనే జట్టులో స్ధానాన్ని ఎలా కోల్పోయానో నాకు అర్ధం కావడం లేదు" అని సాహా పేర్కొన్నాడు.
చదవండి: "త్వరలోనే భారత జట్టులోకి వస్తా.. నా విజయంలో అతడిదే కీలక పాత్ర"

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)