amp pages | Sakshi

ఎంత కష్టం.. ఒకే ఒక్క వికెట్‌ కోసం చకోర పక్షుల్లా

Published on Mon, 12/05/2022 - 18:38

రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ సంచలన విజయం నమోదు చేసింది. జీవం లేని పిచ్‌పై మ్యాచ్‌ నిర్వహించారంటూ విమర్శలు వ్యక్తమయిన వేళ ఇంగ్లండ్‌ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. టెస్టు మ్యాచ్‌లో ఉండే అసలు మజాను రుచి చూపించారు. కానీ ఇంగ్లండ్‌ పాక్‌ రెండో ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్లు తీయడానికి ఎంత కష్టపడిందో తెలియదు కానీ చివరి వికెట్‌ తీయడానికి మాత్రం చాలా ఇబ్బంది పడింది.

పాకిస్థాన్‌ చివరి జోడీ నసీమ్‌ షా, మహ్మద్‌ అలీ పదో వికెట్‌ పడకుండా చాలాసేపు అడ్డుకున్నారు.8.5 ఓవర్ల పాటు పోరాడి మ్యాచ్‌ను డ్రాగా ముగించడానికి ప్రయత్నించారు. ఓవైపు ఓవర్లు కరిగిపోతుండటంతో ఇంగ్లండ్‌ అన్ని విధాలుగా చివరి వికెట్‌ తీయడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే ఆ ఒక్క వికెట్‌ దక్కించుకోవడం కోసం చకోర పక్షుల్లా ఎదురుచూశారు.

ఎంతలా అంటే జట్టులో ఉండే 11 మంది ఒక బ్యాటర్‌ చుట్టూ మోహరించారు. బౌలర్‌ వేసిన బంతి ఎటు కొడుదామన్న కచ్చితంగా ఫీల్డర్‌ చేతుల్లోకి వెళుతుంది. అలాంటి స్థితిలోనూ పాక్‌ బ్యాటర్లు కాసేపు ప్రతిఘటించారు. కానీ చివరికి స్పిన్నర్‌ లీచ్‌.. నసీమ్‌ షా (6)ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌ చేర్చడంతో ఇంగ్లండ్‌ గెలుపు సంబరాల్లో మునిగిపోయింది.

ఇక 343 రన్స్‌ టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 268 రన్స్‌కు ఆలౌటైంది. ఒక దశలో పాక్ టార్గెట్ దిశగా దూసుకెళ్లి ఇంగ్లండ్‌ను భయపెట్టింది. ఇమాముల్‌ హక్‌ (48), అజర్‌ అలీ (40), సాద్‌ షకీల్‌ (76), మహ్మద్‌ రిజ్వాన్‌ (46), అఘా సల్మాన్‌ (30) తలా ఇన్ని పరుగులు చేశారు. అయితే ఇంగ్లండ్‌ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ పాక్‌పై ఒత్తిడి పెంచారు.

ఇక ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 657 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ నుంచి నలుగురు బ్యాటర్లు శతకాలతో చెలరేగారు. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ తామేం తక్కువ తిన్నామా అన్నట్లుగా చెలరేగింది. పాక్‌ బ్యాటర్లలో ముగ్గురు సెంచరీలతో కథం తొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో 579 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌కు 78 రన్స్‌ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్‌ 7 వికెట్లకు 264 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసి పాకిస్థాన్‌ ముందు 342 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ బౌలర్లలో ఓలీ రాబిన్సన్‌, జేమ్స్‌ ఆండర్సన్‌ నాలుగేసి వికెట్లు తీశారు.

చదవండి: ఫలితం రాదనుకున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ అద్బుతం

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌