amp pages | Sakshi

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన సూర్యకుమార్‌ యాదవ్‌

Published on Mon, 01/30/2023 - 15:46

లక్నోలోని అటల్‌ బిహారి వాజ్‌పేయ్‌ స్టేడియం వేదికగా నిన్న (జనవరి 29) న్యూజిలాండ్‌తో జరిగిన లో స్కోరింగ్‌, హై ఓల్టేజీ మ్యాచ్‌లో టీమిండియా ఆపసోపాలు పడి, 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో హార్ధిక్‌ సేన 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుని సిరీస్‌ విజయావకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విధ్వంసకర ఆటగాడు, మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (31 బంతుల్లో 26 నాటౌట్‌; ఫోర్‌) తన సహజ శైలికి భిన్నంగా ఆచితూచి ఆడి, జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.

సూర్యకు కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా (20 బంతుల్లో 15 నాటౌట్‌; ఫోర్‌) సహకరించాడు. బంతి నాట్యం చేస్తున్న పిచ్‌పై ఎంతో సంయమనం పాటించి, కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా సహకారంతో జట్టును విజయతీరాలకు చేర్చిన సూర్యకుమార్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. అంతుచిక్కని పిచ్‌పై వికెట్‌ కాపాడుకుంటూ, ఇటుకలు పేర్చిన చందంగా ఒక్కో పరుగు రాబట్టి ఇన్నింగ్స్‌ను నిర్మించిన సూర్యకుమార్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా, రెండో టీ20లో టీమిండియాకు ఎంతో అవరసమైన విక్టరీని అందించిన సూర్యకుమార్‌.. ఇవాళ ఉదయం ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను అతని అధికారిక నివాసంలో కలిశాడు. ఈ సందర్భంగా సూర్యతో కలిసి దిగిన ఫోటోను స్వయంగా యోగినే ట్విటర్‌లో షేర్‌ చేశాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, శక్తివంతుడైన స్కై (మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ప్లేయర్‌)తో లక్నోలోని అధికారిక నివాసంలో అంటూ యోగి తన ట్వీట్‌కు కామెంట్స్‌ జోడించాడు.

ఈ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన యోగి.. టీమిండియా గెలుపు అనంతరం కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యాకు పుష్పగుచ్చం అందించి అభినందించాడు. ఈ ఫోటోను నిన్ననే ట్విటర్‌లో షేర్‌ చేసిన యోగి.. హార్ధిక్‌.. బదాయి హో (అభినందనలు) అంటూ కామెంట్స్‌ జోడించాడు. ఈ రెండు ట్వీట్‌లు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. 
  
 

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)