amp pages | Sakshi

తండ్రి కలను నెరవేర్చిన సిరాజ్‌

Published on Sun, 12/27/2020 - 10:27

హైదరాబాద్‌: ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత పేసర్‌, హైదరాబాదీ మహ్మద్‌ సిరాజ్‌ అరంగేట్రం చేశాడు. లబుషేన్‌ (132 బంతుల్లో 48; ఫోర్లు 4) ను ఔట్‌ చేయడం ద్వారా తన తొలి మెయిడెన్‌ వికెట్‌ తీశాడు. ఇక సిరాజ్‌ టెస్టు ఎంట్రీ సందర్భంగా అతని సోదరుడు మహ్మద్‌ ఇస్మాయిల్‌ ఆనందం వ్యక్తం చేశాడు. తమ తండ్రి కలను సిరాజ్‌ నిజం చేశాడని అన్నాడు. తమకెంతో గర్వంగా ఉందని మీడియా పేర్కొన్నాడు. తన తమ్ముడి ఆటకోసం ఉదయం నాలుగు గంటలకే టీవీ ఆన్‌​ చేశామని ఇస్మాయిల్‌ చెప్పుకొచ్చారు. ఇక తొలి టెస్టులో గాయపడటంతో మహ్మద్‌ షమీ రెండో టెస్టుకు దూరమయ్యాడు. దాంతో సిరాజ్‌కు తుది జట్టులో చోటు దక్కింది. 

కాగా, మహ్మద్‌ సిరాజ్‌ తండ్రి ఊపితిత్తుల వ్యాధితో బాధపడుతూ గత నవంబర్‌లో హైదాబాద్‌లో మృతి చెందారు. అయితే, ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న సిరాజ్‌ కరోనా నిబంధనల మేరకు తండ్రి అంత్యక్రియలకు స్వదేశానికి రాలేకపోయాడు. అతను భారత్‌ వచ్చేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చినప్పటికీ.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా సిరాజ్‌ అక్కడే ఉండిపోయాడు. అతని నిర్ణయం పట్ల చాలా మంది క్రీడా ప్రముఖులు, అభిమానులు ప్రశంసలు కురిపించారు. ఇక బాక్సింగ్‌ డే టెస్టులో తొలి సెషన్‌లో బౌలింగ్‌ చేసిన సిరాజ్‌ లబుషన్‌ వికెట్‌తో పాటు కామెరూన్‌ గ్రీన్‌ (60 బంతుల్లో 12)ను పెవిలియన్‌ పంపాడు. 15 ఓవర్లు వేసి 40 పరుగులకు 2 వికెట్లు తీశాడు. వాటిలో 4 ఓవర్లు మెయిడెన్‌ కావడం విశేషం. ఇదిలాఉండగా.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 195 లకు ఆలౌట్‌ చేసిన టీమిండియా ప్రస్తుతం 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. 10 పరుగుల ఆదిక్యంలో కొనసాగుతోంది. అజింక్యా రహానే (62), రవీంద్ర జడేజా (12) క్రీజులో ఉన్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)