amp pages | Sakshi

బంగ్లాతో తొలి టెస్ట్‌.. పంత్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ, అతడి స్థానంలో..!

Published on Mon, 12/12/2022 - 16:24

IND VS BAN 1st Test: డిసెంబర్‌ 14 నుంచి బంగ్లాదేశ్‌తో జరుగబోయే తొలి టెస్ట్‌కు ముందు టీమిండియా యువ వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌కు బీసీసీఐ భారీ షాకిచ్చింది. తొలుత ప్రకటించిన భారత టెస్ట్‌ జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా ఉన్న పంత్‌ను తప్పించిన బీసీసీఐ.. అతడి స్థానంలో చతేశ్వర్‌ పుజారాకు ఆ బాధ్యతలు అప్పజెప్పింది. గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతూ ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న పంత్‌కు ఇది భారీ షాక్‌ అనే చెప్పాలి.

టీమిండియా మేనేజ్‌మెంట్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో పంత్‌కు టెస్ట్‌ జట్టులో కూడా స్థానం​ లేదన్న సంకేతాలు అందుతున్నాయి. తొలి టెస్ట్‌లో పంత్‌ స్థానంలో వికెట్‌కీపర్‌గా శ్రీకర్‌ భరత్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అదనపు బౌలర్‌ను తీసుకోవాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తే శ్రీకర్‌ భరత్‌ను కూడా తుది జట్టులో ఆడించే అవకాశం ఉండదు. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ వికెట్‌కీపింగ్‌ బాధ్యతలు కూడా మోసే అవకాశం ఉంది. 

కాగా, న్యూజిలాండ్‌ పర్యటనలో దారుణంగా విఫలమైన పంత్‌ను టీమిండియా యాజమాన్యం గాయాం సాకుగా చూపి అఖరి నిమిషంలో వన్డే జట్టు (బంగ్లాతో సిరీస్‌) నుంచి తప్పించిన విషయం తెలిసిందే. తాజాగా పంత్‌ను టెస్ట్‌ జట్టు వైస్‌ కెప్టెన్సీ నుంచి కూడా తప్పించడంతో అతని భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. పంత్‌ స్థానంలో జట్టులోకి వచ్చే ఆటగాడు ఇషాన్‌ కిషన్‌లా రెచ్చిపోతే, టెస్ట్‌ల్లో కూడా పంత్‌ స్థానం గల్లంతైనట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఇదిలా ఉంటే, గాయం కారణంగా రోహిత్‌ శర్మ జట్టుకు దూరం కావడంతో అతని స్థానంలో కేఎల్‌ రాహుల్‌ బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. రోహిత్‌తో పాటు షమీ, జడేజాలు కూడా గాయాల బారిన పడటంతో బంగ్లా టూర్‌కు తొలుత ఎంపిక చేసిన జట్టులో భారీ మార్పులు జరిగాయి. షమీ, జడేజాల స్థానంలో నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్ జట్టులో చేరగా.. రోహిత్ శర్మ స్థానంలో  అభిమన్యు ఈశ్వరన్  కొత్తగా వచ్చాడు.

బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు భారత జట్టు..
శుభ్‌మన్‌ గిల్‌, అభిమన్యు ఈశ్వరన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, చతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లి, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, సౌరభ్‌ కుమార్‌, కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), శ్రీకర్‌ భరత్‌ (వికెట్‌కీపర్‌), రిషబ్‌ పంత్‌, కుల్దీప్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, నవ్‌దీప్‌ సైనీ   

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)