amp pages | Sakshi

కోహ్లిని దాటాడు; రోహిత్‌తో సమానంగా నిలిచాడు

Published on Fri, 10/01/2021 - 17:40

Babar Azam Suprass Kohli And Equals Rohit Sharma.. పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యున్నత ఫామ్‌ను కనబరుస్తున్నాడు. సెంచరీలను మంచినీళ్ల ప్రాయంగా అందుకున్న బాబర్‌ అజమ్‌ తాజాగా టి20ల్లో కొత్త రికార్డు సాధించి చరిత్ర సృష్టించాడు. టి20ల్లో సెంచరీలు చేయడం చాలా అరుదుగా కనిపిస్తుంది. నేషనల్‌ టి20కప్‌లో భాగంగా సెంట్రల్‌ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బాబర్‌ అజమ్‌ నార్తన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. 63 బంతులెదుర్కొన్న అజమ్‌ 105 పరుగులు సాధించాడు. ఇందులో 11 ఫోర్లు.. 3 సిక్స్‌లు ఉన్నాయి. అయితే బాబర్‌ అజమ్‌ మెరుపు ఇన్నింగ్స్‌ జట్టును గెలిపించలేకపోయినప్పటికీ కొన్ని రికార్డులు మాత్రం బద్దలు కొట్టాడు.

చదవండి: Punam Raut: అంపైర్‌ ఔటివ్వలేదు.. పెవిలియన్‌ చేరి మనసులు దోచుకుంది

తాజా సెంచరీతో టి20ల్లో అన్ని మ్యాచ్‌లు కలిపి బాబర్‌ అజమ్‌ 6 సెంచరీలు సాధించాడు. 193 మ్యాచ్‌ల్లోనే అజమ్‌ ఈ ఫీట్‌ను అందుకున్నాడు. కాగా రోహిత్‌ శర్మ టి20ల్లో 353 మ్యాచ్‌లాడి 6 సెంచరీలు సాధించాడు. ఇక పాకిస్తాన్‌కే చెందిన అహ్మద్‌ షెహజాద్‌(222 మ్యాచ్‌ల్లో 5 సెంచరీలు), కమ్రాన్‌ అక్మల్‌(280 మ్యాచ్‌ల్లో 5 సెంచరీలు), టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(315 మ్యాచ్‌ల్లో 5 సెంచరీలు) సాధించారు. తాజాగా బాబర్‌ అజమ్‌ విరాట్‌ కోహ్లిని అధిగమించి రోహిత్‌తో సమానంగా నిలిచాడు. అయితే మ్యాచ్‌ల పరంగా చూస్తే మాత్రం బాబర్‌ అజమ్‌(193 మ్యాచ్‌లు) తొలి స్థానంలో ఉన్నాడు. 

ఇక ఓవరాల్‌గా చూసుకుంటే క్రిస్‌ గేల్‌ 448 మ్యాచ్‌ల్లో 22 సెంచరీలతో తొలి స్థానంలో ఉన్నాడు. మైకెల్‌ క్లింగర్‌ 2వ స్థానం (206 మ్యాచ్‌ల్లో 8 సెంచరీలు), డేవిడ్‌ వార్నర్‌ 306 మ్యాచ్‌ల్లో 8 సెంచరీలతో మూడో స్థానం, ఆరోన్‌ ఫించ్‌ (324 మ్యాచ్‌ల్లో 8 సెంచరీలు) నాలుగు.. లూక్‌ రైట్‌(336 మ్యాచ్‌ల్లో 7 సెంచరీలు) ఐదు.. బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌(370 మ్యాచ్‌ల్లో 7 సెంచరీలతో ఆరో స్థానంలో ఉ‍న్నారు.

చదవండి: Virender Sehwag: ప్రత్యర్థి ఆటగాడిని దూషించాడు.. మనోడైనా తిట్టాడు; అది క్రీడాస్పూర్తి

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌