amp pages | Sakshi

భారీ జంప్‌ కొట్టిన అక్షర్‌ పటేల్‌, పడిపోయిన కేఎల్‌ రాహుల్‌

Published on Wed, 02/22/2023 - 19:42

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా సత్తా చాటారు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా జరిగిన తొలి రెండు టెస్ట్‌ల్లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఇరగదీసిన వీరు బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఆల్‌రౌండర్ల విభాగంలో ర్యాంకులను మెరుగుపర్చుకున్నారు.

ఇదే సిరీస్‌లో తొలి టెస్ట్‌లో సెంచరీ చేసినప్పటికీ టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ర్యాంక్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. హిట్‌మ్యాన్‌ ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. యాక్సిడెంట్‌ కారణంగా గత రెండు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నప్పటికీ రిషబ్‌ పంత్‌ 6వ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు.

ఈ విభాగంలో లబూషేన్‌ టాప్‌లో కొనసాగుతుండగా.. స్టీవ్‌ స్మిత్‌, బాబర్‌ ఆజమ్‌ రెండు, మూడు స్థానాలను పదిలం చేసుకున్నారు. ఈ సిరీస్‌లో రెండు అర్ధసెంచరీలతో(84, 74) చెలరేగిన అక్షర్‌ పటేల్‌.. ఏకంగా 18 స్థానాలు ఎగబాకి బ్యాటింగ్‌ విభాగంలో 61వ ప్లేస్‌కు చేరుకున్నాడు. కోహ్లి 16వ స్థానం‍లో, జడేజా 33వ స్థానంలో కొనసాగుతుండగా.. పుజారా ఓ స్థానం మెరుగుపర్చుకుని 25వ స్థానానికి, శ్రేయస్‌ అయ్యర్‌ 10 స్థానాలు కోల్పోయి 27కు, మయాం‍క్‌ అగర్వాల్‌ ఓ స్థానం కోల్పోయి 28కి, కేఎల్‌ రాహుల్‌ 7 స్థానాలు కోల్పోయి 58వ ప్లేస్‌కు పడిపోయారు. 

బౌలింగ్‌ విభాగంలో ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ (866).. పాట్‌ కమిన్స్‌ను వెనక్కునెట్టి అగ్రస్థానానికి చేరుకోగా.. అశ్విన్‌ (864) ఓ ప్లేస్‌ మెరుగుపర్చుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆసీస్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఆడనప్పటికీ బుమ్రా 5వ స్థానాన్ని కాపాడుకోగా.. జడేజా (763) 6 స్థానాలు మెరుగుపర్చుకుని 9వ స్థానానికి ఎగబాకాడు.

ఆల్‌రౌం‍డర్ల విభాగంలో టీమిండియా ఆటగాళ్లు ఆల్‌టైమ్‌ బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ కనబర్చారు. 460 రేటింగ్‌ పాయింట్లతో జడ్డూ భాయ్‌, 376 పాయింట్లతో అశ్విన్‌ తొలి రెండు స్థానాలను నిలబెట్టుకోగా.. అక్షర్‌ పటేల్‌ 2 స్థానాలు మెరుపర్చుకుని 5వ స్థానానికి చేరాడు.    
 

Videos

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)