amp pages | Sakshi

Avesh Khan: ఆ ఎక్స్‌ప్రెషన్స్‌ ఏంటి బాబూ! అయ్యర్‌తో స్టెప్పులు ఇరగదీసిన ఆవేశ్‌ ఖాన్

Published on Fri, 03/18/2022 - 11:41

Avesh Khan- Venkatesh Iyer: టీమిండియా యువ పేసర్‌ ఆవేశ్‌ ఖాన్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. తనకు సంబంధించిన అప్‌డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటాడు. ఈ క్రమంలో నెటిజన్లను ఊపేస్తున్న అరబిక్‌ కుతూ పాటకు తనదైన శైలిలో స్టెప్పులేశాడు. సహచర క్రికెటర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌తో కలిసి డాన్స్‌ అదరగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆవేశ్‌ ఖాన్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు.

ఈ క్రమంలో నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘‘ఆ ఎక్స్‌ప్రెషన్స్‌ ఏంటి బాబూ.. ఇద్దరు డాన్స్‌ చించేశారు. స్టెప్పులతో అదరగొట్టారు. మీ డాన్స్‌ విజయ్‌ ఫ్యాన్స్‌కు తప్పక నచ్చుతుంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా తమిళ స్టార్‌ హీరో విజయ్‌, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'బీస్ట్‌'లోని అరబిక్‌ కుతూ సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా మారిన విషయం తెలిసిందే.

ఇక ఈ యువ క్రికెటర్ల విషయానికొస్తే.. ఐపీఎల్‌ మెగా వేలం- 2022లో భాగంగా కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్స్‌ ఆవేశ్‌ ఖాన్‌ను 10 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. మరోవైపు.. వెంకటేశ్‌ అయ్యర్‌ విషయానికొస్తే.. అతడిని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 8 కోట్లకు రిటైన్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు టీమిండియా తరఫున అరంగేట్రం చేశారు. పేసర్‌గా ఆవేశ్‌ ఖాన్‌, ఆల్‌రౌండర్‌గా అయ్యర్‌ తమ కెరీర్‌కు బాటలు వేసుకుంటున్నారు.

చదవండి: IPL 2022: కప్‌ గెలుస్తారో లేదో తెలీదు.. మా మనసులు దోచుకున్నారు

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌