amp pages | Sakshi

టీమిండియా క్రికెటర్లను దారుణంగా అవమానించిన ఐసీసీ

Published on Thu, 01/20/2022 - 16:06

2021 ఐసీసీ టీ20 జట్టులో ఒక్క భారత ఆటగాడికి కూడా అవకాశం కల్పించకుండా ఘోరంగా అవమానించిన ఐసీసీ.. గంటల వ్యవధిలోనే మరోసారి టీమిండియా ఆటగాళ్లను చులకన చేసింది. తాజాగా విడుద‌ల చేసిన మెన్స్ వ‌న్డే టీమ్ ఆఫ్ 2021లో కూడా భార‌త ఆట‌గాళ్ల‌కు చోటు కల్పించకుండా చిన్న చూపు చూసింది. పైగా దాయాది పాక్‌ ఆటగాళ్లను మరోసారి అందలం ఎక్కించింది. పాక్‌ సారధి బాబర్‌ ఆజమ్‌ను టీ20 జట్టు కెప్టెన్‌గా ఎంచుకున్న ఐసీసీ.. వన్డే జట్టు పగ్గాలు కూడా అతనికే అప్పగించింది. దీంతో టీమిండియా అభిమానులు తీవ్ర అసంతృప్తితో రగిలి పోతున్నారు. 


వ‌న్టే జ‌ట్టులో ఐర్లాండ్‌కు చెందిన పాల్‌ స్టిర్లింగ్‌, దక్షిణాఫ్రికా ఆటగాడు జన్నెమన్‌ మలాన్‌లను ఓపెన‌ర్లుగా ఎంపిక‌ చేసిన ఐసీసీ.. వన్‌ డౌన్‌ కోసం బాబర్‌ ఆజమ్‌, నాలుగో స్థానంలో పాక్‌ బ్యాటర్‌ ఫ‌క‌ర్ జ‌మాన్‌, ఐదో ప్లేస్‌లో సౌతాఫ్రికా చిచ్చర పిడుగు డ‌స్సెన్‌లను ఎంచుకుంది. ఆల్‌రౌండ‌ర్ల కోటాలో బంగ్లాదేశ్ ఆట‌గాడు ష‌కీబుల్ హాస‌న్, సిమి సింగ్‌(ఐర్లాండ్‌), వికెట్ కీప‌ర్‌గా ముష్ఫికర్ ర‌హీం(బంగ్లాదేశ్‌), ఏకైక స్పిన్నర్‌గా వనిందు హసరంగ(శ్రీలంక), పేసర్ల కోటాలో ముస్తాఫిజుర్ రెహ్మాన్‌(బంగ్లాదేశ్‌), దుష్మంత చమీర(శ్రీలంక)లను ఎంపిక చేసింది. 

కాగా, నిన్న ప్రకటించిన టీ20 జట్టుకు ఓపెనర్లుగా జోస్‌ బట్లర్‌, మహ్మద్‌ రిజ్వాన్‌లను ఎంపిక చేసిన ఐసీసీ.. మూడో స్థానం కోసం బాబర్‌ ఆజమ్‌ను, నాలుగో ప్లేస్‌కు మార్క్రమ్‌(దక్షిణాఫ్రికా), ఐదో ప్లేస్‌కు మిచెల్‌ మార్ష్‌(ఆస్ట్రేలియా), ఆ తరువాత వరుసగా డేవిడ్‌ మిల్లర్‌(దక్షిణాఫ్రికా), వనిందు హసరంగ(శ్రీలంక), తబ్రేజ్‌ షంషి(దక్షిణాఫ్రికా), జోష్‌ హేజిల్‌వుడ్‌(ఆస్ట్రేలియా), ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌(బంగ్లాదేశ్‌), షాహీన్‌ అఫ్రిది(పాకిస్థాన్‌)లను ఎంచుకుంది. కాగా, గతేడాది పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో టీమిండియా క్రికెటర్లు ఆశించిన మేర రాణించకపోవడం వల్లే ఐసీసీ జట్లలో చోటు దక్కలేదని తెలుస్తోంది. 
చదవండి: టీమిండియా క్రికెటర్లకు ఘోర అవమానం..!

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌