amp pages | Sakshi

టీఎస్‌ఐఐసీకి ఓంకారేశ్వరుడి భూములు

Published on Mon, 03/27/2023 - 04:32

యాచారం: నందివనపర్తి ఓంకారేశ్వరాలయ భూమిని టీఎస్‌ఐఐసీకి అప్పగించడానికి రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్ణయించింది. నందివనపర్తిలో ఉన్న ఓంకారేశ్వరాలయానికి నందివనపర్తి గ్రామంతో పాటు నస్దిక్‌సింగారం, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో 145 సర్వే నంబర్‌ నుంచి 230 సర్వే నంబర్‌ వరకు 1,400 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఆయా గ్రామాల్లో ఓంకారేశ్వరాలయానికి చెందిన 1,100 ఎకరాల భూమిని తమకు కేటాయించాలని కొద్ది నెలల క్రితం టీఎస్‌ఐఐసీ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖకు విన్నవించింది. దేవాదాయ, ధర్మాదాయ శాఖ నుంచి స్పష్టమైన హామీ లభించడంతో ఆలయ భూమి సేకరణ కోసం త్వరలో టీఎస్‌ఐఐసీ అవార్డు జారీ చేయనుంది. అవార్డుకు ముందే ఆలయ భూమిని పూర్తిగా సర్వే చేసి హ ద్దులు గుర్తించనున్నారు. పరిహారం ధర నిర్ణయం పూర్తి కాగానే డబ్బులను నందివనపర్తి గ్రామంలోని ఎస్‌బీఐలో ఉన్న ఓంకారేశ్వరుడి ఖాతాలో టీఎస్‌ఐఐసీ జమ చేయనుంది.

ఏళ్లుగా కౌలు రైతుల సాగు

నందివనపర్తిలోని ఓంకారేశ్వరాలయానికి చెందిన 80 సర్వే నంబర్లలోని 1,400 ఎకరాల భూమిపై 60 ఏళ్లుగా నందివనపర్తి, నస్దిక్‌సింగారం, కుర్మిద్ద, తాడిపర్తి గ్రామాలకు చెందిన సుమారు 600 మందికిపైగా రైతులు సాగు చేసుకుని జీవనోపాధి పొందు తున్నారు. కౌలు రైతులకు 37 ఏ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. ఏళ్లుగా దేవాలయానికి కౌలు కూడ చెల్లిస్తున్నారు. ఏళ్లుగా సాగులో లేని భూమిని యోగ్యంగా మార్చుకోవడం కోసం రూ.లక్షల్లో ఖర్చు చేశా రు. తాజాగా టీఎస్‌ఐఐసీ ఓంకారేశ్వరాలయ భూ ములను తీసుకుంటుందని తెలియడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. కౌలు రైతులు తమకు 37 ఏ సర్టిఫికెట్లు ఉన్నాయని.. కబ్జాలో ఉన్నాం.. తమకే ఆ భూములపై పట్టాదారు, పాసుపుస్తకాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే విషయమై ఆలయ ఈఓ ప్రవీణకుమార్‌ను స్రంపదించగా 1,100 ఎకరాలకు పైగా ఆలయ భూమిని టీఎస్‌ఐఐసీ తీసుకోవడానికి నిర్ణయించినట్లు తెలిపారు. త్వరలో అధికార జీవో వస్తుందన్నారు.

సానుకూలంగా స్పందించిన

దేవాదాయ, ధర్మాదాయ శాఖ

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)