amp pages | Sakshi

బీజేపీ, టీఆర్‌ఎస్‌లతో అమీతుమీ

Published on Tue, 01/25/2022 - 02:10

సాక్షి, రంగారెడ్డి జిల్లా/హైదరాబాద్‌: ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో తలపడి.. పార్టీపరంగా ప్రజల్లో బలపడేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సీపీఎం తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభ తీర్మానించింది. టీఆర్‌ఎస్‌ అప్రజాస్వామిక పాలనను అడ్డుకోవాలని, బీజేపీని నిలువరించాలని పిలుపునిచ్చింది.

కమ్యూనిస్టుల మనుగడ కొనసాగాలంటే ప్రభుత్వాల నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటాలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. వామపక్షాలు చేపట్టే పోరాటాలకు ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌ కేంద్రంగా జరుగుతున్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభల్లో 54 అంశాలపై సోమవారం తీర్మానాలు చేసింది.  

పోటీ, పొత్తు అంశాన్ని పక్కన పెట్టి.. 
ప్రస్తుతానికి ఎన్నికల్లో పోటీ, పొత్తులు అనే అంశాన్ని పక్కనపెట్టి పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణపైనే మహాసభల్లో ఎక్కువ చర్చ జరిగినట్లు స్పష్టం చేసింది. యువతను, మహిళలను, అణగారిన వర్గాలను పెద్దఎత్తున సమీకరించి పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని గుర్తించింది. ఈ ప్రజా పోరాటంలో కలిసి వచ్చే వామపక్ష, లౌకిక శక్తులను కలుపుకొనిపోవాలని నిర్ణయించింది. మహాసభల ప్రాంగణంలో పార్టీ కేంద్రకమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య, నాగయ్య, సుదర్శన్‌ సహా జిల్లా కమిటీ కార్యదర్శి భాస్కర్‌లు ఈమేరకు మీడియాకు వెల్లడించారు.  

టీఆర్‌ఎస్‌ డాంబికాలు 
‘తెలంగాణ ధనిక రాష్ట్రమని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్ని డాంబికాలు పలికినా ఎప్పుడూ లేనంత వేగంగా గత ఏడేళ్లలో అప్పులు పెరిగాయి. తాజా లెక్కల ప్రకారం అవి రూ.2,86,000 కోట్లకు చేరాయి. అదీగాక, 20 శాతానికి మించి పంట రుణాలు అందటం లేదు. అసైన్డ్‌ భూములు, పోడు భూములు గుంజుకుంటున్నారు. కోవిడ్‌ కేసులు, మరణాలు తక్కువ చేసి చూపుతున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాలకిస్తున్న ప్రాధాన్యత ప్రజా సమస్యల పరిష్కారానికి ఇవ్వడంలేదు’అని సీపీఎం పేర్కొంది. 

బలపడాలని చూస్తున్న బీజేపీ 
రాష్ట్రంలో ఉన్న ప్రజల అసంతృప్తిని ఆసరా చేసుకొని బీజేపీ బలపడాలని చూస్తోందని సీపీఎం ధ్వజమెత్తింది. ‘ప్రజల అసంతృప్తిని భావోద్వేగాలవైపు మరల్చే ప్రయత్నంలో బీజేపీ ఉంది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరలించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాదయాత్ర చేశారు. మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి మతం రంగు పులిమి ప్రచారం చేస్తున్నారు’అని మండిపడింది.

బీజేపీ మతోన్మాద విధానాలను వ్యతిరేకించటంలోనూ, లౌకిక విధానాల కోసం నిలబడటంలోనూ టీఆర్‌ఎస్‌ అవకాశవాదం ప్రదర్శిస్తోందని దుయ్యబట్టింది. కాంగ్రెస్‌ వైఖరి కూడా బీజేపీ బలపడటానికే ఉపయోగపడుతోందని వ్యాఖ్యానించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాటానికి కాంగ్రెస్‌ సిద్ధంగా లేదని ఆరోపించింది.  

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)