Breaking News

‘సీఎం జగన్‌తోనే నా పయనం’

Published on Sun, 03/12/2023 - 08:44

సాక్షి, దర్శి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే తన రాజకీయ పయనం ఉంటుందని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. కొన్ని మీడియా సంస్థలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తన కుమారుడి వివాహం, సొంత పనుల కారణంగా రెండు నెలలుగా నియోజకవర్గానికి దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. 

కాగా, ప్రకాశం జిల్లా దర్శిలోని తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ఎలా చెబితే అలా నడుచుకుంటానని స్పష్టంచేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలో తిరిగి వైఎస్సార్‌సీపీ గెలుస్తుందన్నారు. దర్శి పట్టణం, నియోజకవర్గంలో ఇంటింటికీ మంచినీటి సరఫరా కోసం త్వరలో టెండర్లు పిలుస్తున్నట్టు తెలిపారు. దర్శిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం నిర్మాణానికి రూ.6 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. ఎన్నికల కోడ్‌ ముగిశాక గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళతానని చెప్పారు.


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)