amp pages | Sakshi

దళితబంధు ఆపించడం అవివేకం: కొప్పుల ఈశ్వర్‌

Published on Mon, 10/18/2021 - 23:16

హుజూరాబాద్‌: దళితబంధు కార్యక్రమాన్ని ఎన్నికలు పూర్తయ్యే వరకు నిలిపివేయాల్సిందిగా ఎన్నికల కమిషన్‌కు బీజేపీ లేఖలు రాసి అడ్డుకోవడం అవివేకమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విమర్శించారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్‌ ఈ పథకం తెచ్చారని చెప్పారు. ఇప్పటికే 17 వేల మంది దళిత కుటుంబాలకు వారి వారి ఖాతాల్లో డబ్బులు పడ్డాయని తెలిపారు. సోమవారం స్థానిక టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

దళితబంధును పైలెట్‌ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అమలుపరిస్తే, దానిని నిలిపివేయాలని బీజేపీ నాయకుడు ప్రేమేందర్‌ రెడ్డి లేఖ రాశారని, ఆ లేఖ ఆధారంగానే ఎన్నికల సంఘం దళితబంధును నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. ఈటల రాజేందర్‌ కుట్రలో భాగంగానే దళితబంధును నిలిపివేశారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. దళితబంధు పథకాన్ని నిలిపి వేయాల్సిందిగా ఒకవైపు ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేస్తూనే, మరోవైపు సీఎం కేసీఆర్‌ను నిందించడం వెనుక దగాకోరుతనం తేటతెల్లమవుతోందని అన్నారు. బీజేపీ కుట్రలు దళితులు అర్థం చేసుకోవాలని సూచించారు.

ఎమ్మెల్యే బాల్క సుమన్‌ మాట్లాడుతూ.. అదాని, అంబానీలు బాగుపడితే చాలు, దళిత కుటుంబాలు బాగుపడవద్దనే ఉద్దేశంతోనే బీజేపీ ఇలాంటి నిర్ణయం తీసుకుందన్నారు. బీజేపీని దళిత సమాజం మొత్తం ప్రశ్నించాలన్నారు. అనంతరం బండ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఈటల దిష్టిబొమ్మను స్థానిక అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద దహనం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజ్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, సుంకె రవిశంకర్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  

 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌