Breaking News

బీజేపీ అధికారంలోకొస్తే పేదలకు భూములు, ఇళ్లు

Published on Tue, 02/21/2023 - 02:29

నాగోలు: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పేదలకు భూములు ఇచ్చుడేమోగానీ గడచిన నాలుగు దశాబ్దాలుగా పేదల ఆధీనంలో ఉన్న భూములను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గుంజుకుంటోందని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ప్రజాగోస–బీజేపీ భరోసా, బీజేపీ కార్నర్‌ మీటింగ్‌లను నాగోలు కార్పొరేటర్‌ చింతల అరుణ సురేందర్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో నాగోలు చౌరస్తాలో, బీజేపీ హస్తినాపురం డివిజన్‌ అధ్యక్షుడు నరేష్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో సోమవారం హస్తినాపురం చౌరస్తాలో నిర్వహించారు.

ఆయా సమావేశాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ... ‘పల్లెల్లో ఉపాధి లేక వేల మంది పట్నానికి వలస వచ్చారు. వీరంతా రెక్కల కష్టాన్ని నమ్ముకున్నవారు. గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వమని అడిగితే ఇవ్వడంలేదు. ఒక్కరికి కూడా 50 గజాల భూమి ఇవ్వలేదు సరికదా ఎప్పుడో ఇచ్చిన భూమిని గద్దల్లా గుంజుకుంటున్నారు’ అని ఆరోపించారు. హైదరాబాద్‌లో కిరాయిలు కట్టలేకపోతున్నాం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు ఇవ్వాలని కోరుతున్నారన్నారు. మంత్రి కేటీఆర్‌ ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారో బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

‘ఎల్‌బీనగర్‌ కాలనీ వారికి భూములు రెగ్యులరైజ్‌ చేస్తామని మునుగోడు ఎన్నికల సందర్భంగా కేటీఆర్‌ వచ్చి జీఓ 118 ఇచ్చారు. ఓట్లు వేయించుకున్నారు. తరువాత మర్చిపోయారు. ఏమాత్రం నిజాయితీ ఉన్నా 118 జీఓను అమలు చేయాలి’ అని ఈటల డిమాండ్‌ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే పేదల భూములకు పట్టాలు ఇస్తామని ఈటల రాజేందర్‌ స్పష్టం చశారు.

పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని...ఉద్యోగావకాశాలను కల్పిస్తాం అని భరోసా ఇస్తున్నామని తెలిపారు. బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి మాట్లాడుతూ... గత ఎన్నికల్లో ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్మే ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. బీజేపీ ఎల్‌బీనగర్‌ కన్వీనర్‌ రవీందర్‌గౌడ్, వనస్థలిపురం కార్పొరేటర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, నేతలు కన్నెబోయిన రాజయ్యయాదవ్, బద్దం బాలకృష్ణగౌడ్, శ్యామల, పద్మారెడ్డి, మైనం రాజేష్, రావుల శ్రీనివాస్, డప్పు రాజు, రాఘవాచారి, హస్తినాపు రం డివిజన్‌ అధ్యక్షుడు నరేష్‌ యాదవ్‌ పాల్గొన్నారు.  

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)