amp pages | Sakshi

రుణమాఫీ.. రూ.2 లక్షలు..కాంగ్రెస్‌ ‘వరంగల్‌  రైతు డిక్లరేషన్‌’లో హామీలు

Published on Sat, 05/07/2022 - 02:03

వరంగల్‌ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రైతులను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపడతామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు వరంగల్‌లో శుక్రవారం నిర్వహించిన ‘రైతు సంఘర్షణ సభలో అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ‘రైతుల కోసం వరంగల్‌ డిక్లరేషన్‌’ను ప్రకటించారు. దీనిని కాంగ్రెస్‌ తప్పకుండా అమలు చేస్తుందని రాహుల్‌గాంధీ  ప్రకటించారు. ఈ డిక్లరేషన్‌లో ఉన్న అంశాలివీ.. 

  • ఏకకాలంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ 
  •  భూమి ఉన్న రైతులు, కౌలు రైతులకు ఇందిరమ్మ రైతు భరోసా పథకం పేరిట ఏటా ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం  
  •  ఉపాధి హామీ పథకం కింద నమోదు చేసుకున్న భూమి లేని రైతులకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం 
  •  వరి, పత్తి, మిర్చి, చెరుకు, పసుపు తదితర పంట లకు మెరుగైన గిట్టుబాటు ధర.. రైతు పండించిన చివరి గింజ వరకు కొనుగోళ్లు. 
  •  మూసివేసిన చెరుకు కర్మాగారాలను తెరిపించేం దుకు చర్యలు. పసుపు బోర్డు ఏర్పాటు చేసి రెండు పంటలు పండించే రైతులకు ప్రయోజనం చేకూర్చేలా చర్యలు. 
  • మెరుగైన పంటల బీమా పథకం అమలు. శరవేగంగా నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహా రం అందించేలా ఏర్పాట్లు. రైతుకూలీలు, భూమి లేని రైతులకు కూడా రైతు బీమా వర్తింపు.  

  •  వ్యవసాయానికి ఉపాధి హామీ పథకం అనుసంధానం. 
  • పోడు భూములు, అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కుల కల్పన. 
  • రైతుల పాలిట శాపంగా మారిన ’ధరణి’ పోర్టల్‌ రద్దు. అన్ని రకాల భూములకు రక్షణ కల్పించే విధంగా సరికొత్త రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు. 
  •  రైతుల ఆత్మహత్యలకు కారణమైన నకిలీ విత్తనాలు, పురుగు మందుల విక్రేతలపై కఠిన చర్యలు, పీడీ యాక్ట్‌ కింద కేసులు. సదరు సంస్థలు, వ్యక్తుల ఆస్తులను జప్తు చేసి నష్టపోయిన రైతులకు అందించేలా నిబంధనలు. 
  • అవినీతికి తావు లేకుండా నిర్దిష్ట కాల పరిమితిలో పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి. 
  • రైతు హక్కుల పరిరక్షణ కోసం చట్టపరమైన అధికారాలతో ‘రైతు కమిషన్‌’ ఏర్పాటు.  
  •  భూముల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తగిన పంటల ప్రణాళిక. వ్యవసాయాన్ని పండుగగా మార్చేలా ప్రణాళికలు. 
  • పంటలకు గిట్టుబాటు ధరల కల్పన.  

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)