Breaking News

బండి సంజయ్‌ Vs అరవింద్‌: తెలంగాణ బీజేపీలో మరోసారి లుకలుకలు

Published on Sun, 03/12/2023 - 17:02

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ బీజేపీలో మరోసారి లుకలుకలు మొదలయ్యాయి. తాజాగా బండి సంజయ్‌- అరవింద్‌ మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. కవితపై బండి సంజయ్‌ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ అరవింద్‌ తప్పుబట్టారు. కవితపై బండి సంజయ్‌ వ్యాఖ్యలను సమర్థించనని అరవింద్‌ అన్నారు.

ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సంజయ్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదని హితవు పలికారు. సామెతలను ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ‘‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా పవర్‌ సెంటర్‌ కాదు. అందరినీ సమన్వయం చేసే బాధ్యత అది’’ అంటూ అరవింద్‌ సూచించారు.

‘‘కవిత ఈడీ ఆఫీసులో ఉంటే తెలంగాణ కేబినెట్‌ అంతా ఢిల్లీలో మకాం వేసింది. ఇదే చిత్తశుద్ధి ప్రజల అభివృద్ధిపై ఉంటే రాష్ట్రం బాగుపడేది’’ అని అరవింద్‌ పేర్కొన్నారు. ‘‘దర్యాప్తు కు కవిత సహకరించలేదని తెలిసింది. ఎందుకు, ఏమిటి, ఎలా అని ఈడీ అధికారులు అడిగితే.. కవిత ఏమో, తెలవదు, గుర్తు లేదు అని సమాధానం చెప్పినట్టు తెలిసింది. చేతికి 20లక్షల గడియారం, కోట్ల రూపాయల నగలు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు తెలుసు. అవినీతిని అంతం చేయాలని మోదీ కంకణం కట్టుకున్నారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతిలో మునిగితేలారు’’ అంటూ ఎంపీ అరవింద్‌ దుయ్యబట్టారు.
చదవండి: ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్‌ నవ్య ఎపిసోడ్‌లో బిగ్‌ ట్విస్ట్‌

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)