amp pages | Sakshi

టీఆర్‌ఎస్‌ గెలుపు పోలీసులు, ఈసీదే..

Published on Mon, 11/07/2022 - 01:41

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలుపు కొందరు పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. ఆదివారం మునుగోడు ఫలితం వెలువడ్డాక బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్, పార్టీ నేతలు డాక్టర్‌ మనోహర్‌రెడ్డి, ఎస్‌.కుమార్, టి.వీరేందర్‌గౌడ్, జె.సంగప్ప, వెంకటరమణలతో కలసి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు.

‘సీఎం మోచేతి నీళ్లు తాగుతున్న ఆ అధికారులు టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు అడ్డదారులు తొక్కారు. పోలీసులే దగ్గరుండి డబ్బు పంచారు. రూ. వందల కోట్లు పంచిన టీఆర్‌ఎస్‌ నేతలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎందుకు పట్టుపడలేదో, ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు కాలేదో వారు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్‌కు బీజేపీకంటే అధిక ఓట్లు రావాలని ఆ పార్టీ తరఫున సైతం టీఆర్‌ఎస్‌ నేతలు డబ్బు పంచారు.

అయినా ప్రజలు టీఆర్‌ఎస్‌కు అసలు సిసలైన ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆశీర్వదించారు’ అని సంజయ్‌ పేర్కొన్నారు. అయితే ప్రజాతీర్పును శిరసావహిస్తున్నామని ప్రకటించారు. ఓడిపోయినప్పడు కుంగిపోమని, గెలిచినప్పుడు పొంగిపోమని చెప్పారు. రాజగోపాల్‌రెడ్డి యుద్ధంలో హీరోలా పోరాడారన్నారు.

వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం..
‘టీఆర్‌ఎస్‌ నేతల పిచ్చి కూతలతో బీజేపీ కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. మరింత ఉత్సాహంతో, కసితో ప్రజలపక్షాన పోరాడతాం. వచ్చే ఎన్నికల్లో మునుగోడులో బీజేపీ జెండా ఎగరేస్తాం. మునుగోడు ఫలితంపై విశ్లేషించుకుంటాం’ అని బండి చెప్పారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ఈ ఫలితం ద్వారా మరోసారి నిరూపితమైందన్నారు.

‘తెలంగాణలో కాంగ్రెస్‌ ఖతమైంది. సిట్టింగ్‌ స్థానాన్ని ఆ పార్టీ కోల్పోయింది. కనీసం డిపాజిట్‌ కూడా దక్కించుకోలేకపోయింది. సీపీఐ, సీపీఎంతో ప్రత్యక్షంగా, కాంగ్రెస్‌తో పరోక్షంగా పొత్తు పెట్టుకొని పోటీ చేసినా... మనీ, మద్యం, మాంసం ఏరులై పారించినా... ఎన్నికల సంఘం అధికారులను, పోలీసులను అడ్డుపెట్టుకున్నా టీఆర్‌ఎస్‌కు 10 వేలకు మించి మెజారిటీ రాలేదు. బీజేపీ సింహంలా సింగిల్‌గా పోటీ చేసి గతంతో పోలిస్తే 7 రెట్లు అధికంగా 86 వేలకుపైగా ఓట్లు సాధించింది’ అని బండి సంజయ్‌ చెప్పారు. 

ఆ 12 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ముందా? 
సీఎం కేసీఆర్‌కు ధైర్యముంటే కాంగ్రెస్‌ నుంచి అనైతికంగా టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికల్లోకి వెళ్లే దమ్ముందా? అని సంజయ్‌ సవాల్‌ విసిరారు. ఉపఎన్నికలో గెలిపిస్తే మునుగోడులోని సమస్యలన్నీ 15 రోజుల్లో పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారని... ఆ గడువులోగా హామీలన్నింటినీ అమలు చేయాల్సిందేనని లేనిపక్షంలో ఊరుకోబోమని హెచ్చరించారు.

కాగా, మునుగోడులో నైతిక విజయం బీజేపీ, రాజగోపాల్‌రెడ్డిదేనని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె. లక్ష్మణ్‌ చెప్పారు. సీఎం కేసీఆర్‌ మనీ, మద్యాన్ని ఏరులై పారించినా, ఊరికో ఎమ్మెల్యేను, మంత్రిని నియమించినా, రెండుసార్లు సీఎం పర్యటించినా బీజేపీ ఓటు బ్యాంకును తగ్గించలేకపోయారన్నారు.   

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)