amp pages | Sakshi

టెన్షన్‌.. టెన్షన్‌..! పశ్చిమ యూపీలో ఒక్కో ఓటుకై పార్టీల ఆరాటం

Published on Wed, 01/26/2022 - 13:26

Up Assembly elections 2022: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు సమీపించిన కొద్దీ పార్టీలు ఓట్ల లెక్కల్లో తలమునకలైపోతున్నాయి. కిందటిసారి 2017లో యూపీలోని 47 సీట్లలో ఆయా పార్టీల అభ్యర్థులు ఐదు వేల ఓట్ల కంటే తక్కువ తేడాతో ఓడిపోయారు. పోటాపోటీగా ఎన్నికల జోరు జరుగుతున్న ప్రస్తుతం తరుణంలో పార్టీలు ఈ 47 స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించి ఒక్క ఓటును కూడా పక్కకు పోనివ్వకూడదనే పట్టుదలతో కార్యక్షేత్రంలో పనిచేస్తున్నాయి. మెజారిటీలైనా, ఓడిన మార్జిన్‌లైనా స్వల్పంగా ఉన్నందువల్ల ఈసారి రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో అత్యంత జాగురూకతతో వ్యవహరిస్తున్నాయి. ఏ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థి అయితే మేలు... స్థానికంగా ఎవరికి పరపతి ఉంది, అభ్యర్థుల కలుపుగోలుతనం... తదితరాలన్నీ పరిగణనలోకి తీసుకొని  అలవాంటి వారినే ప్రోత్సహిస్తున్నారు. ఒకటికి రెండుసార్లు సర్వేలు ద్వారా ధ్రువీకరించుకున్నాకే టికెట్లను కేటాయిస్తున్నారు.  
చదవండి: సీఎం యోగిపై పోటీకి రెడీ.. టిక్కెట్‌ ఇవ్వండి

ఏక్‌ ఔర్‌ దక్కా... 
స్వల్ప తేడాలతోనే గతంలో తామీ సీట్లను పొగొట్టుకున్నాం కాబట్టి ఈసారి మరింత కష్టపడితే గెలుపు తమదే అవుతుందని రాజకీయపక్షాలు లెక్కలేసుకుంటున్నాయి. హిందుత్వ కార్డు, అభివృద్ధి మంత్రానికి తోడు స్థానికంగా అభ్యర్థి ప్రభావం కలిసి తమను విజయతీరాలకు చేరుస్తుందని బీజేపీ నమ్ముతోంది. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ చిన్నాచితక పార్టీలతో కూడా పొత్తు పెట్టుకున్నందువల్ల ఇలాంటి గెలుపొటముల మధ్య అతితక్కువ తేడాలున్న ఈ నియోజకవర్గాల సామాజికవర్గాల సమీకరణ తమకు లాభిస్తుందని ఎస్పీ చీఫ్‌ నమ్మకంతో ఉన్నారు.
చదవండి: Punjab Assembly Election 2022: భగవంత్‌ మాన్‌.. ఆప్‌ బూస్టర్‌ షాట్‌

ఓబీసీల్లో కీలకమైన నేతలుగా గుర్తింపు పొందిన స్వామి ప్రసాద్‌ మౌర్య, ధారాసింగ్‌ చౌహాన్‌లు బీజేపీని వీడి తమ పంచన చేరడం బాగా అనుకూలించే విషయమని అఖిలేశ్‌ నమ్ముతున్నారు. ఎందుకంటే మొత్తం యూపీ జనాభాలో 50 శాతం ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ తలరాత మార్చాలన్నా అది వీరిచేతుత్లోనే ఉంటుంది. కిందటి ఎన్నికల్లో దుమారియగంజ్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర ప్రతాప్‌సింగ్‌ కేవలం 171 ఓట్లతో బీఎస్పీ అభ్యర్థి సయేదా ఖాతూన్‌పై నెగ్గారు. ఐదు వందల ఓట్లలోపు తేడాతో ఐదు చోట్ల వివిధ పార్టీలు పరాజయం చవిచూశారు. కాగా, మరో ఇద్దరు  1,000 ఓట్లలోపు తేడాతో ఓడిపోయారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌