amp pages | Sakshi

ప్రాంతీయ చిచ్చుకు చంద్రబాబు కుట్ర

Published on Tue, 07/13/2021 - 04:18

సాక్షి, అమరావతి: ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలతో రాయలసీమ లిఫ్ట్‌ ఆపించాలంటూ లేఖ రాయించడాన్ని తప్పుబట్టారు. చంద్రబాబు, ప్రసార మాధ్యమాల అధిపతులు  రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు రాష్ట్రానికి దెయ్యాల్లా దాపురించారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

ఆ జిల్లాల అభివృద్ధికి వైఎస్సే కారణం
ప్రకాశం, గుంటూరు జిల్లాలను వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎన్‌ఎస్‌పీ ఆధునికీకరణతో అభివృద్ధి చేశారు. వెలిగొండ ప్రాజెక్టును తీసుకొచ్చారు. గుండ్లకమ్మ రిజర్వాయర్, రామతీర్థం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేశారు. కొర్సిపాడు లిఫ్ట్, సోమశిల నుంచి రాళ్లపాడుకు సామర్థ్యం పెంచడం వైఎస్సార్‌ కాలంలోనే జరిగాయి. ఈ జిల్లాలకు  చంద్రబాబు చేసిందేంటి? వెలిగొండ పనులు వైఎస్సార్‌ కాలంలో 11.5 కిలోమీటర్లు పూర్తయితే.. చంద్రబాబు ఐదేళ్లలో 4 కిలోమీటర్లు మాత్రమే పూర్తిచేశారు. జగన్‌ 18 నెలల్లోనే మొదటి టన్నెల్‌ను 2.8 కిలోమీటర్లు, రెండో టన్నల్‌ను కిలోమీటరుకుపైగా పూర్తిచేశారు.  రెండో టన్నెల్‌ను కూడా 2023లోగా పూర్తిచేసి నీరందించేందుకు కృషిచేస్తున్నారు. గోదావరి నుంచి నీరు తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజీ నుంచి ఎన్‌ఎస్‌పీ కెనాల్‌కు పంపేందుకు ఇప్పటికే రూ.500 కోట్లు ఖర్చుచేశారు. 

భయపడి తెలంగాణతో బాబు రాజీ
తెలంగాణలో ఐదేళ్లలోనే  పాలమూరు రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల ప్రాజెక్టులు కట్టారు. ఓటుకు కోట్లు కేసులో చిక్కుకున్న చంద్రబాబు తెలంగాణతో రాజీపడ్డాడు. అప్పట్లోనే చంద్రబాబు.. రాయలసీమ ఎత్తిపోతల ఆలోచన చేసి ఉంటే బాగుండేది కదా? పోతిరెడ్డిపాడులోంచి నీరు తీసుకెళ్తుంటే ఒకప్పుడు దేవినేని ఉమాతో ప్రకాశం బ్యారేజీ దగ్గర ధర్నా చేయించాడు. చిత్తూరు జిల్లాలో 3 రిజర్వాయర్లు కట్టి 8 నుంచి 10 టీఎంసీల నీరు నింపాలని వైఎస్‌ జగన్‌ ఆలోచిస్తే.. రాజకీయభిక్ష పెట్టిన జిల్లాకే ప్రాజెక్టులు రాకుండా కేసులు వేయించి అడ్డుకున్న దుర్మార్గుడు చంద్రబాబు. 

ఇంత దుష్ప్రచారమా? 
లేటరైట్‌ను బాక్సైట్‌ అంటూ చంద్రబాబు చేస్తున్నదంతా దుష్ప్రచారమే. ఈ ప్రభుత్వం లేటరైట్‌కు ఒక్క పర్మిషన్‌ ఇవ్వలేదు. కేవలం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులనే అమలు చేసింది. 2015లో పర్యావరణ అనుమతులు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే. 2018లో కోర్టు ఆర్డర్‌ ఇచ్చినా ఆయన ఎందుకు అడ్డుకోలేదు? తన పార్టీ వ్యక్తి అయ్యన్నపాత్రుడు, ఆయన కొడుకు గిరిజనుల పేరుతో మైన్‌లు తీసుకుని నడిపారు. వైఎస్‌ జగన్‌ అన్ని ప్రాంతాల అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు. నీటిహక్కు ఉన్నమేరే ప్రాజెక్టులు కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు ఇకనైనా నీచ రాజకీయాలు మానుకోవాలి.  

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)