amp pages | Sakshi

జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో పారిశుద్ధ్యంపై ఆరా

Published on Sat, 03/25/2023 - 02:08

నరసరావుపేట: పల్నాడు జిల్లాలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో పారిశుద్ధ్యం ఎలా ఉందని జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ అధికారులను ఆరా తీశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులు పలు మండల కేంద్రాల్లోని ప్రభుత్వ వసతి గృహాలు, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో రాత్రి బస చేశారు. దీనిపై శుక్రవారం ఉదయాన్నే కలెక్టర్‌ చేపట్టిన గ్రామోదయం కార్యక్రమం ద్వారా మండల అధికారుల కమిటీ ట్రాన్సెక్ట్‌ వాక్‌ పేరుతో పలు ప్రాంతాల్లో పర్యటించారు. అధికారుల పర్యటనలో అక్కడ ఉన్న పరిస్థితులు, గుర్తించిన సమస్యలు, వాటికి చూపిన పరిష్కార మార్గాలు తదితర అంశాలపై శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ ఎస్‌ఆర్‌ శంకరన్‌ వీడియో కాన్ఫరెన్‌ హాలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో బడి నిద్ర కార్యక్రమంలో సందర్శించిన పాఠశాలల్లో నాడు–నేడు పథకం ద్వారా జరుగుతున్న పనుల పెండింగ్‌ అంశాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఏఏ మండలాల్లో పర్యటించారు. అక్కడ గుర్తించిన సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను అడిగి తెలుసుకున్నారు. బడుల్లో రక్తహీనత సమస్యతో బాధపడుతున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు. వారికి అధికారులు అందించిన సూచనలు, సలహాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ బడుల్లో తాగునీటి సమస్యను గుర్తించారా? వాటి పరిష్కార మార్గాలు చూపిన విధానాలను జిల్లా కలెక్టర్‌ కనుక్కొన్నారు. ప్రజలకు ఆధార్‌ అప్‌డేషన్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించి ఓటర్‌ కార్డును ఆధార్‌ కార్డుకు అనుసంధానం చేయాలన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులు, సర్వశిక్ష అభియాన్‌ అధికారులు, ఆయా సంక్షేమ శాఖల వసతి గృహాధికారులు, స్పెషల్‌ ఆఫీసర్స్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

వీడియా కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)