amp pages | Sakshi

ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య కల్పించాల్సిందే

Published on Sat, 03/25/2023 - 02:06

డీఈఓ సి.వి. రేణుక

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): జిల్లాలోని ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలలో పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాలను కల్పించాలని జిల్లా విద్యా శాఖాధికారి సి.వి. రేణుక స్పష్టం చేశారు. ఉచిత నిర్భంద విద్యా హక్కు చట్టాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి కచ్చితంగా అమలు చేసేలా ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలలో ఉచిత నిర్భంద విద్యా హక్కు చట్టం అమలు పై శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి సి.వి.రేణుక ఆమె కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉచిత నిర్భంద విద్యా హక్కు చట్టం 12(1) (సి) ప్రకారం 2023–24 విద్యా సంవత్సరం నుంచి జిల్లాలో ఐబీ, ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ, స్టేట్‌ సిలబస్‌లను అమలు చేస్తున్న అన్ని ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలలో ఒకటో తరగతి నందు పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాలను కల్పించాలన్న ఆదేశాలను ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యలు కచ్చితంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 25 శాతం సీట్లలో అనాథ బాలలు, దివ్యాంగులు, హెచ్‌ఐవీ బాధిత కుటుంబాలకు చెందిన పిల్లలకు 5 శాతం ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం ఓసీ, బీసీ, మైనార్టీ వర్గాలలో నిరుపేదలకు 6 శాతం కేటాయించారన్నారు. జిల్లాలోని ఉప విద్యా శాఖాధికారులు, మండల విద్యా శాఖాధికారులు, సంబంధిత ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలను, విలేజ్‌ వార్డు సచివాలయ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు సహాయం చేయాలన్నారు. విద్యా సంవత్సరంలో 1వ తరగతిలో అర్హులైన ప్రతి ఒక్కరికి అడ్మిషన్‌ ప్రక్రియ పూర్తి చేసేలా ఆదేశించారు. అర్హులైన విద్యార్థులు ప్రవేశాల కొరకు ఏప్రిల్‌ 10వ తేదీ లోపు http://cse.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)