amp pages | Sakshi

భారత సంతతి విద్యార్థిపై దాడి...మోదీజీ సాయం చేయండి అంటూ వేడుకోలు

Published on Fri, 10/14/2022 - 13:31

సిడ్నీ: భారత సంతతి విద్యార్థిపై ఒక దుండగుడు 11 సార్లు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు బాధితుడని శుభమ్‌ గార్గ్‌గా గుర్తించారు. అతను సిడ్నీలోని న్యూ సౌత్‌వేల్స్‌ యూనివ‍ర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నట్లు తెలిపారు. అతని తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉంటారు. శుభమ్‌ ఐఐటీ మద్రాస్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకుని ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. గత నెల అక్టోబర్‌ 6న శుభమ్‌పై దాడి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులు తెలిపారు.

అలాగే నిందితుడు 23 ఏళ్ల వ్యక్తి అని, అతను ఆ రోజు శుభమ్‌ వద్దకు వచ్చి డబ్బులు డిమాండ్‌ చేశాడని తెలిపారు. ఐతే శుభమ్‌ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో కత్తితో పలు చోట్ల దాడి చేసి పరారైనట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత శుభమ్‌ ఏదోరకంగా సమీపంలోని తన ఇంటికి వెళ్లి తదనంతరం ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. పోలీసులు సదరు నిందితుడిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. 

భాదితుడి తండ్రి రమణివాస్‌ గార్గ్‌ తన కొడుకుకి పొత్తి కడుపులో సుమారు 11 గంటల ఆపరేషన్‌ జరిగినట్లు చెప్పారు. దయచేసి తన కొడుకు చికిత్సకు సాయం అందించమని, అలాగే తాము ఆస్ట్రేలియా వెళ్లేందుకు వీసా వచ్చేలా ఏర్పాటు చేయమని కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ మేరకు బాధితుడి చెల్లెలు కావ్య గార్గే ట్విట్టర్‌లో..."సిడ్నీలో ఉన్న తన సోదరుడు శుభమ్‌ గార్గ్‌పై చాలా దారుణమైన దాడి జరిగింది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.

అతన్ని చూసేందుకు మా కుటుంబానికి అత్యవసర వీసా ఏర్పాటు చేసి సాయం అందించండి" అని ప్రధాని నరేంద్ర మోదీని, విదేశాంగ మంత్రి జై శంకర్‌, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని అభ్యర్థిస్తూ ట్వీట్‌ చేశారు. అంతేగాదు తన సోదరుడికి త్వరితగతిన సర్జరీలు చేయకపోతే ఇన్ఫెక్షన్‌ శరీరమంతా వ్యాపిస్తుందని డాక్టర్లు చెప్పారని వాపోయింది.  ఈ మేరకు సిడ్నీలోని భారత రాయబార కార్యాలయం బాధితునికి తగిన సాయం అందిస్తోంది. అంతేగాదు ఆస్ట్రేలియా హై కమిషన్‌ సదరు బాధిత కుటుంబ సభ్యునికి వీసా సౌకర్యం కల్పించనుందని హై కమిషన్‌ ప్రతినిధి తెలిపారు

(చదవండి: మళ్లీ పేలిన తుపాకీ.. ఉత్తర కరొలినాలో కాల్పుల కలకలం)

Videos

లండన్ కు చేరుకున్న సీఎం జగన్

వ్యాక్సిన్ తో ముప్పు?.. ఏది నిజం?

తెలంగాణలో రైతుల్ని నిండా ముంచిన అకాల వర్షం

థియేటర్ కు వచ్చిన వారం రోజుల్లోనే..ఓటీటీలోకి కృష్ణమ్మ మూవీ..

ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..

RCB vs CSK: ప్లే ఆఫ్స్‌ బెర్తుకై చావో రేవో

లక్నో విజయం.. ఓటమితో ముగించిన ముంబై!అట్టడుగున

బుట్టబొమ్మకి బంపర్ ఆఫర్..

ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతు

చిన్నస్వామిలో కురిసేది సిక్సర్ల వర్షమే.. CSKకి ఇక కష్టమే..

Photos

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)