amp pages | Sakshi

అయ్యో ఎంత పని: బాత్‌ వీడియో వైరల్‌, యువతి ఆత్మహత్య

Published on Wed, 08/11/2021 - 11:00

భోపాల్‌: గోప్య, వ్యక్తి గతమైన సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్‌ చేసుకుంటున్న టీనేజర్లకు ఈ సైట్స్ వినియోగం ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయో తెలిపే ఘటన ఇది. తెలిసో తెలియకో, సరదాకోసమో చేసే పిచ్చి పనులు ఒక్కోసారి ప్రాణాలు మీదికి తీసుకొస్తాయి. ఇలాంటి పొరపాటు పనే ఒక యువతి ప్రాణం తీసింది. తన కాబోయే భర్తకు తనకు సంబంధించిన  వ్యక్తిగత వీడియోను పంపాలనుకుంది. కానీ కాస్తా వికటించి చివరికి ప్రాణాలే పోగొట్టుకుంది. మధ్యప్రదేశ్, ఉజ్జయిని పరిధిలోని తోబ్రిఖేడా గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. 

వివరాలను పరిశీలిస్తే.. తోబ్రిఖేడాకు చెందిన యువతికి 15 రోజుల క్రితం ఇండోర్‌కు చెందిన  ఒక యువకుడితో నిశ్చితార్థం జరిగింది. కాబోయే భర్తతో సరదాగా ఫోన్లో మాట్లాడుతూ ఉండేది.  ఈ క్రమంలో ఏమైందో తెలియదుగానీ స్నానం చేస్తున్న వీడియోను భర్తకు పంపాలనుకుంది. అనుకున్నట్టుగా వీడియోను తీసుకుంది. కానీ ఇక్కడే దారుణం జరిగిపోయింది. వాట్సాప్‌ ద్వారా తన కాబోయే భర్తకు పంపాల్సిన వీడియోను, పొరపాటున తన మరో ఫ్రెండ్‌కి పంపేసింది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడానికి బదులుగా మిగిలిన వాట్సాప్ గ్రూపులో షేర్‌ చేశాడు. అంతే అది క్షణాల్లో వైరల్ అయింది.

చివరికి ఈ విషయం బాధిత యువతి తల్లిదండ్రులకు, ఇతర కుటుంబ సభ్యులకు తెలియడంతో తీవ్రంగా మందలించారు. దీంతో జరిగిన పొరపాటును సరిదిద్దుకునే మార్గం తోచక, పరువు పోతుందనే భయంతో ఆమె విషం తాగేసింది. వెంటనే ఆమెను స్థానికంగా ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆ యువతి మరణించింది. దీంతో త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన తమ బిడ్డ శ్మశానానికి తరలి పోవడంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇప్పటివరకు ఈ విషయంలో పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌