amp pages | Sakshi

ఎవరికో వచ్చిన ఆర్డర్‌ లాక్కుని డెలివరీ బాయ్‌పై యువతి దాడి

Published on Wed, 08/24/2022 - 12:18

ప్రస్తుత రోజుల్లో ఆహార పదార్థాలను ఇంటికే డెలివరీ చేస్తున్నాయి పలు సంస్థలు. వర్షం, ట్రాఫిక్‌ వంటి అడ్డంకులను అధిగమించి ఆహారాన్ని మన వద్దకు చేరుస్తారు డెలివరీ ఏజెంట్లు. కొన్ని సార్లు చిన్న పొరపాట్లు జరిగాయని క్షణికావేశంలో డెలివరీ ఏజెంట్లపై కస్టమర్లు దాడి చేసిన సంఘటనలు వెలుగు చూశాయి. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఈ దృశ్యాలను బోగాస్‌04 అనే ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేయగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో.. నడిరోడ్డుపై ఓ డెలివరీ బాయ్‌పై దాడికి దిగింది ఓ యువతి. షూతో కొడుతూ దుర్భాషలాడింది. ఆమె దాడి చేస్తున్నా మౌనంగా ఉండిపోయిన బాధితుడు.. తన ఉద్యోగం పోతుందేమోననే భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ‘హాయ్‌ జొమాటోకేర్‌.. నా ఆర్డర్‌ అందించేందుకు వస్తుండగా డెలివరీ బాయ్‌ దాడికి గురయ్యాడు. అతడి నుంచి ఆర్డర్‌ లాక్కున్న కొందరు మహిళలు అతడిని షూతో కొట్టారు. నా వద్దకు ఏడ్చుకుంటూ వచ్చిన బాధితుడు ఉద్యోగం పోతుందని బాధపడ్డాడు.’ అంటూ రాసుకొచ్చారు నెటిజన్‌. జొమాటో కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేస్తే ఎలాంటి స్పందన లేదని తెలిపారు. తన ఆర్డర్‌ గురించి పట్టించుకోనవసరం లేదని, దాడికి గురైన బాధితుడికి సాయం చేయాలని సూచించినట్లు చెప్పారు. మరోవైపు.. ఈ విషయాన్ని పరిశీలిస్తామని కామెంట్‌ చేసింది జొమాటో. దాడికి పాల్పడిన మహిళపై కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: ‘రియల్‌ హీరో’.. పిల్లలతో విధులకు జొమాటో డెలివరీ బాయ్‌

Videos

పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..

సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో

ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు

రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు

కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి

ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ

YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..

8 ఏళ్ల పాప.. ఈ ఘటన మనసును కలిచివేసింది..

రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్

సినిమా లవర్స్‌కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..

Photos

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)