amp pages | Sakshi

వైరల్‌: చెల్లెలి పెళ్లిలో సోదరుడి సర్‌ప్రైజ్‌.. ఏకంగా తండ్రి రూపాన్నే తీసుకొచ్చి..

Published on Sat, 06/18/2022 - 21:22

అన్న అంటే నాన్నలో సగం అంటారు.  అమ్మా, నాన్నల తర్వాత సోదరికి అంతటి ప్రేమను పంచేది అన్నే. చెల్లెలి ముఖంలో సంతోషం చూసేందుకు అన్న ఎంత కష్టమైన సంతోషంగా చేస్తాడు. సోదరి కష్టాన్ని తన కష్టంగా.. సోదరి సంతోషాన్ని తన సంతోషంగా భావించే అన్నలు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే అన్న ఈ కోవలోకి చెందినవాడే. పిల్లలను అల్లారుముద్దుగా పెంచిన ఓ తండ్రి దురదృష్టవశాత్తు వారికి దూరమయ్యాడు. ఇటీవలే తండ్రి మరణించడంతో అన్న దగ్గరుండి చెల్లెలి పెళ్లి వైభవంగా జరిపించాడు.

అయితే పెళ్లిలో అన్ని ఉన్నా నాన్న లేని లోటు స్పష్టంగా కనిపిస్తుండటంతో సోదరుడు ఓ అద్భుతమైన ఆలోచన చేశాడు. చెల్లెలి పెళ్లిలో నాన్న లేని లోటును తీర్చి ఆమె కళ్లలో ఆనందాన్ని నింపాడు. చనిపోయిన తండ్రి సజీవంగా ఉన్నట్లు మైనంతో ఆయన రూపాన్ని పునఃసృష్టించాడు. సరిగ్గా పెళ్లి సమయానికి మండపంలోకి నాన్న ప్రతి రూపాన్ని తీసుకొచ్చి అందరి కళ్లల్లో ఆశ్యర్యం నింపాడు. వీల్‌చైర్‌లో తండ్రి వస్తుండటం చూసి పెళ్లికూతురు కళ్లల్లో కన్నీరు వరదై పారింది. అది మైనపు బొమ్మ అని తెలిసినా.. నాన్నరూపాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనైంది.  

ఒక్కరేంటి బంధువులు, కుటుంబ సభ్యులు, అతిథులు ఇలా అందరి కళ్లలోనూ పట్టలేని దుఖం, ఆనందం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆ కుంటుంబంలో ఆనందపు భాష్పాలు వెల్లువిరిశాయి. అబ్బురపరిచే ఆనందం గుండెలోంచి తన్నుకుంటూ వచ్చింది. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు గానీ ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కొడుకు తన తండ్రిపై చాటిన ప్రేమకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 
చదవండి: అబ్బబ్బా ఏం చేశారు!.. బాలీవుడ్‌ పాటకు దుమ్ములేపిన నార్వే డ్యాన్సర్లు

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)