amp pages | Sakshi

ట్విట్టర్‌ సంచలన నిర్ణయం: 250 అకౌంట్లు బ్లాక్‌

Published on Mon, 02/01/2021 - 19:40

న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌పై రైతులు సాగిస్తున్న పోరాటం ప్రభావం చాలా అంశాలపై పడుతోంది. వారి నిరసనల నేపథ్యంలోనే తాజాగా ట్విట్టర్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా దాదాపు 250 అకౌంట్లను సోమవారం ట్విట్టర్‌ సంస్థ బ్లాక్‌ చేసింది. అకౌంట్లు బ్లాక్‌ అయిన వారు ఎవరో కాదంట.. తప్పుడు సమాచారం పోస్ట్‌ చేయడంతోపాటు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో ట్విట్టర్‌ చర్యలు చేపట్టింది. అతే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ట్విట్టర్‌ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. తప్పుడు సమాచారం, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న పలువురి ట్విట్టర్‌ ఖాతాలపై చర్యలు తీసుకోవాలంటూ వారం కిందట ట్విట్టర్‌ సంస్థకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. అందులో భాగంగానే ట్విట్టర్‌ తాజా నిర్ణయం.

ప్రసారభారతి సీఈఓతో పాటు పలువురు ప్రముఖ వ్యక్తులకు చెందిన ట్విట్టర్ ఖాతాలను మూసివేస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటన విడుదల చేసింది. "భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడటానికి పారదర్శకత చాలా ముఖ్యమైనది.నిలిపివేయబడిన కంటెంట్ కోసం మాకు నోటీసు విధానం ఉన్నది. కంటెంట్‌ను నిలిపివేయమని అభ్యర్థనలు అందిన అనంతరం ప్రభావిత ఖాతాదారులకు సమాచారాన్ని వెంటనే తెలియజేస్తాం" అని ట్విటర్‌ ఆ ప్రకటనలో తెలిపింది.

'#ModiPlanningFarmerGenocide' హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగిస్తున్న, జనవరి 30వ తేదీన నకిలీ, బెదిరింపు, రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తున్న దాదాపు 250 ట్వీట్లు / ట్విట్టర్ ఖాతాలను బ్లాక్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ.. ట్విట్టర్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రజలను రెచ్చగొడుతుండడంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, సెక్షన్ 69 ఏ కింద ఆయా ట్విట్టర్ ఖాతాలను, ట్వీట్లను బ్లాక్ చేయమని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దేశ రాజధాని సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని దేశంలో శాంతిభద్రతల సమస్యలు పెరగకుండా నిరోధించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖతోపాటు వివిధ చట్ట అమలు సంస్థల అభ్యర్థనను అనుసరించి ట్విట్టర్ సంస్థ ఈ ఖాతాలను బ్లాక్‌ చేసింది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)