amp pages | Sakshi

Dog Temple: నా బిడ్డ కంటే ఎక్కువ! అందుకే..

Published on Tue, 04/05/2022 - 14:26

విశ్వాసం మాటకొస్తే.. ముందుగా గుర్తుకు వచ్చేది శునకమే. ఆ పోలిక ప్రతీదాంట్లోనూ కనిపిస్తుంది. అందులో కొందరు వాటిని అమితంగా ప్రేమిస్తుంటారు కూడా. అఫ్‌కోర్స్‌.. అవి కూడా అంతే ప్రేమను పంచుతాయనుకోండి. 

ఇదిలా ఉంటే.. తమిళనాడులో ఓ రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి తన పెంపుడు కుక్కకు గుర్తుగా ఏకంగా గుడిని కట్టించాడు. శివగంగ జిల్లా మనమధురైకు చెందిన ముత్తు(82) తన పెంపుడు కుక్క టామ్‌ గుర్తు కోసం ఈ పని చేశాడు. 

ముత్తు కుటుంబం మూడు తరాలుగా శునకాలను పెంచుకుంటోందంట. అలాగే ఆయన, టామ్‌ను 2010 నుంచి పెంచుకున్నాడు. దానిని ఒక ఇంటి మనిషిలాగా అపురూపంగా చూసుకున్నాడు. అయితే 2021లో జబ్బు చేసి టామ్‌ చనిపోయింది. అందుకే దానికి గుర్తుగా.. ఇలా విగ్రహంతో గుడి కట్టించి పూజలు చేస్తున్నాడు. ఇందుకోసం తాను సేవింగ్స్‌ రూపంలో దాచుకున్న 80వేల రూపాయలు ఖర్చు చేసి మార్బుల్‌ విగ్రహాన్ని తయారు చేయించాడు. ప్రతీ శుక్రవారం టామ్‌ విగ్రహానికి దండలు వేసి పూజలు చేస్తున్నాడాయన. ఆ గుడి ఇప్పుడు చుట్టుపక్కల ఊళ్లలోనూ ఫేమస్‌ అయ్యింది.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)