amp pages | Sakshi

చెన్నై, బెంగళూరులలో అప్రెంటిస్‌ ఖాళీలు

Published on Wed, 07/14/2021 - 16:03

బెంగళూరులోని భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ఇస్రో) ప్రధాన కార్యాలయం.. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం అప్రెంటిస్‌ ఖాళీల సంఖ్య: 43
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు–13, డిప్లొమా(టెక్నీషియన్‌) అప్రెంటిస్‌లు–10, డిప్లొమా ఇన్‌ కమర్షియల్‌ ప్రాక్టీసెస్‌–20.

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు: విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్, ఫైర్‌ టెక్నాలజీ అండ్‌ సేఫ్టీ. అర్హత: 60శాతం మార్కులకు తగ్గకుండా.. సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్‌: నెలకు రూ.9000 చెల్లిస్తారు.

డిప్లొమా(టెక్నీషియన్‌) అప్రెంటిస్‌: విభాగాలు: మెకానికల్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌. అర్హత: 60శాతం మార్కులకు తగ్గకుండా సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్‌ నెలకు రూ.8000 చెల్లిస్తారు.

డిప్లొమా ఇన్‌ కమర్షియల్‌ ప్రాక్టీసెస్‌: అర్హత: 60శాతం మార్కులకు తగ్గకుండా కమర్షియల్‌ ప్రాక్టీసెస్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్‌ నెలకు రూ.8000 చెల్లిస్తారు.

► 2018, 2019, 2020, 2021లో ఇంజనీరింగ్‌ డిగ్రీ, డిప్లొమా పూర్తిచేసుకున్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

ఎంపిక విధానం: ఇంజనీరింగ్‌ డిగ్రీ, డిప్లొమాలో సాధించిన అకడమిక్‌ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఈమెయిల్‌ ద్వారా ఆఫర్‌ లెటర్‌ పంపిస్తారు.

► దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా 
► ఈమెయిల్‌: hqapprentice@isro.gov.in
► వెబ్‌సైట్‌: www.mhrdnats.gov.in

డీఆర్‌డీఓ, సీవీఆర్‌డీఈలో 57 అప్రెంటిస్‌లు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని అవడిలో ఉన్న డీఆర్‌డీఓ –కంబాట్‌ వెహికల్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌(సీవీఆర్‌డీఈ).. వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం ఖాళీల సంఖ్య: 57

ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌–31, టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌–26.

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, మెకానికల్, లైబ్రరీ సైన్స్, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. స్టైపెండ్‌: నెలకు రూ.9000 చెల్లిస్తారు.

టెక్నీషియన్‌(డిప్లొమా)అప్రెంటిస్‌: విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌అండ్‌ కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషనల్, మెకానికల్‌ ఇంజనీరింగ్‌.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. స్టైపెండ్‌: నెలకు  రూ.8000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థుల రిజిస్టర్డ్‌ ఈమెయిల్‌కి సందేశాలు పంపుతారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► నాట్స్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 20.07.2021 » సీవీఆర్‌డీఈ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 28.07.2021
► వెబ్‌సైట్‌: www.mhrdnats.gov.in

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌