amp pages | Sakshi

సీఎం స్టాలిన్‌ మరో కీలక నిర్ణయం.. సరికొత్త పథకానికి శ్రీకారం

Published on Sun, 12/19/2021 - 14:23

ప్రమాదాల బారిన పడి ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న వారిని సకాలంలో ఆస్పత్రులకు తరలించి, రక్షించే ప్రత్యేక వైద్య పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆది పరాశక్తి అమ్మవారు కొలువైన మేల్‌ మరువత్తూరు వేదికగా ఈ పథకానికి శనివారం సీఎం ఎంకే స్టాలిన్‌ శ్రీకారం చుట్టారు. దయ చేసి వాహన వేగాన్ని తగ్గించుకుని, మనల్ని మనం రక్షించుకుందామని, ఇతరుల ప్రాణాల్ని కాపాడుకుందామని ఈ సందర్భంగా ప్రజలకు సీఎం విజ్ఞప్తి చేశారు. 

సాక్షి, చెన్నై: డీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చినానంతరం బృహత్తర వైద్య పథకాల్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రమాద రహిత రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దడమే కాకుండా, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని సకాలంలో ఆస్పత్రులకు తరలించేందుకు ప్రత్యేక వైద్యపథకంపై సీఎం స్టాలిన్‌ దృష్టి పెట్టారు. ఆ మేరకు ‘ఇన్నుయిర్‌  కాప్పోం’– 48 ( ప్రాణాలను కాపాడుదాం – 48 గంటల్లో) పేరుతో రూపొందించిన ఈ పథకం రాష్ట్రంలోని 610 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అమల్లోకి వచ్చింది. 

48 గంటలు ఉచిత సేవ 
మేల్‌ మరువత్తూరులో ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం స్టాలిన్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలోని గ్రామ, పట్టణ, నగర, జాతీయ రహదారుల్లో ఎక్కడ ప్రమాదం జరిగినా సకాలంలో బాధితులకు వైద్య సేవలు అందేవిధంగా ఆస్పత్రుల్ని ఎంపిక చేశామని వివరించారు. మనల్ని మనం రక్షించుకోవడమే కాకుండా, ఇతరుల ప్రాణాలను కాపాడాలన్న సంకల్పంతోనే ఈ పథకానికి ఇన్నుయిర్‌ కాప్సోం –48 అని నామకరణం చేశామన్నారు. ఆస్పత్రిలో చేరిన 48 గంటల పాటుగా క్షతగ్రాతులకు ఉచితంగా వైద్యసేవలు అందుతాయని, ఆ తదుపరి సీఎం బీమా పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించారు. ప్రమాదానికి గురైన వారు తమిళనాడు వాసులే కానక్కర్లేదని, ఇతర రాష్ట్ర వాసులైనా, దేశాలకు చెందిన వారైనా సరే అందరికీ సమానంగా ఈ పథకం వర్తిస్తుందని వివరించారు.

చదవండి: (ఓబీసీ రిజర్వేషన్‌ రద్దు.. ఓటు అడిగేందుకు రావద్దు..)

ప్రమాదంలో గాయపడ్డ వారిని సకాలంలో ఆస్పత్రులకు తరలించే వారికి ప్రోత్సాహక నగదుగా రూ. 5 వేలు పంపిణీ చేయనున్నామని తెలిపారు. అత్యవసర కాలంలో ప్రతిఒక్కరూ స్పందించాలని, ప్రాణాల్ని కాపాడాలని పిలుపునిచ్చారు. దయచేసి రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని, హెల్మెట్, సీటు బెల్ట్‌ ధరించి వాహనాల్ని నడపాలని, అతివేగాన్ని వీడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రమాద రహిత రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దుదామని, నిబంధనల్ని అనుసరిస్తామని ప్రతిఒక్కరూ ఈసందర్భంగా ప్రతిజ్ఞ చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో మంత్రులు ఎం. సుబ్రమణియన్, కేఎన్‌ నెహ్రు, ఏవీ వేలు, తాము అన్భరసన్, ఎంపీ సెల్వం, ఎమెల్యేలు  కరుణానిధి, ఎస్‌ఆర్‌ రాజ, అరవింద్‌ రమేష్‌ పాల్గొన్నారు.  

చదవండి: (పంజాబ్‌లో అమరీందర్‌తో కాషాయదళం పొత్తు)

టీకా శిబిరం పరిశీలన 
కరోనా వ్యాక్సిన్‌ శిబిరం శనివారం రాష్ట్రంలో 50 వేల శిబిరాల్లో జరిగాయి. పెద్దఎత్తున జనం ఉదయాన్నే శిబిరాల వద్ద బారులు తీరారు. రెండో డోస్‌ టీకాను అత్యధిక శాతం మంది వేయించుకున్నారు. గూడువాంజేరిలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని సీఎం స్టాలిన్‌ పరిశీలించారు. టీకా వేయించుకునేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.   

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)