భూకుంభకోణం: ముఖ్యమంత్రికి భారీ ఊరట

Published on Mon, 04/05/2021 - 16:16

న్యూఢిల్లీ: భూకుంభకోణం కేసులో కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పకు భారీ ఊరట లభించింది. ఆ కేసు విషయంలో విచారణ ఏమీ అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. పదేళ్ల కిందట సీఎంగా ఉన్న యడియూరప్ప 24 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని ఆరోపణలు వచ్చాయి.

ఈ ఆరోపణలపై 2012లో లోకాయుక్తలో చార్జిషీటు కూడా దాఖలైంది. ఈ చార్జిషీట్‌ ఆధారంగా విచారణ చేయాలని ప్రత్యేక కోర్టుకు కర్నాటక హైకోర్టు గతనెలలో ఆదేశించింది. దీంతో యడియూరప్ప పదవికి గండం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తలుపు తట్టగా విచారణ చేపట్టిన న్యాయస్థానం కర్నాటక హైకోర్టు నిర్ణయంపై స్టే విధించింది. దీంతో యడియూరప్పకు భారీ ఊరట లభించింది. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ