amp pages | Sakshi

మండపంలోకి రాగానే వధువు చేసిన పనికి అందరూ షాక్‌!

Published on Tue, 06/01/2021 - 15:36

ల‌క్నో: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రతిరోజు వేలాదిగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో  అనేక రాష్ట్రాలు కోవిడ్​ కట్టడికి లాక్​డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, కరోనా నిబంధనలు పకడ్బందీగా అమలయ్యేలా ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.

అయితే కల్యాణమొచ్చినా, కక్కొచ్చినా ఆగదన్నట్లు లాక్‌డౌన్‌లో పెళ్లిళ్లు సహా ఇతరత్రా వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఈ వేడుకలు అతి కొద్దిమంది సమక్షంలోనే జరుగుతున్నాయి. అయితే, తాజాగా ఉత్తర ప్రదేశ్​లో జరిగిన ఒక పెళ్లిలో కరోనా నిబంధనలను అతిక్రమించడమే కాకుండా, మండపంలో వధువు రివాల్వర్​ను పైకెత్తి ఆకాశంలో కాల్పులు జరిపింది. దీనికి సంబంధించిన వీడియో  ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.  

పూర్తి వివరాల్లోకి వెళితే.. యూపీలోని జేత్వారాలో జరిగిన ఒక వివాహ వేడుకలో వధువు  రూపా పాండె, వరుడితో కలసి పెళ్లి మండపానికి చేరుకుంది. ఈ క్రమంలో ఆమె, తన మేనమామ రామ్నివాస్​ పాండె రివాల్వర్​ను తీసుకుంది. వివాహ వేదికపైకి ఎక్కుతున్న క్రమంలో ఒక్కసారిగా గాలిలో కాల్పులు జరిపింది. ఆ తర్వాత రివాల్వర్​ను తన మామకు అప్పగించింది. అయితే, ఆ రివాల్వర్​కు లైసెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ వీడియో యూపీ పోలీసుల కంట పడటంతో పెళ్లి కూతురిని, ఆమె మేనమామ రామ్నివాస్‌లను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. అతని రివాల్వర్​ లైసెన్స్​ కూడా రద్దు చేయనున్నట్లు  ప్రకటించారు.

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వివాహా వేడుకకు కేవలం 25 మందికి మాత్రమే అనుమతి ఉంది. కానీ అక్కడ అంతకన్నా ఎక్కువ మంది జనం హాజరయ్యారు. దీంతో వీరందరిపై అంటు వ్యాధులు నిరోధక ​ చట్టం కింద కేసులను నమోదు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు.  

చదవండి: గాలిలో ఎగిరిన ఐఫోన్​.. వైరల్​ వీడియో

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)